మాదాపూర్ లో అక్రమ వేప్ విక్రయాలు.. ఈగల్ టీం దాడులు.. నలుగురు అరెస్ట్..

మాదాపూర్ లో అక్రమ వేప్ విక్రయాలు.. ఈగల్ టీం దాడులు.. నలుగురు అరెస్ట్..

హైదరాబాద్ లో యూత్ ను టార్గెట్ చేస్తూ అక్రమ వేప్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మాదాపూర్ లోని వేప్ విక్రయాలు సాగిస్తున్న షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించింది ఈగల్ టీం. అక్రమంగా వేప్ విక్రయాలు సాగిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.ఈ దాడుల్లో 92 నిషేధిత వేప్స్, 15 ప్యాకెట్ల విదేశీ సిగరెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు.

వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లలో ప్రచారం చేస్తూ... ఆన్లైన్లో అర్దార్లు తీసుకొని డోర్ డెలివరీలు చేస్తూ దందా సాగిస్తున్నారని తెలిపారు పోలీసులు. Smokin Spot WhatsApp గ్రూప్‌లో 79 మంది సభ్యులు ఉన్నారని.. సోషల్ మీడియా ద్వారా కస్టమర్లకు ఎర వేస్తున్నారని తెలిపారు. ర్యాపిడో, పోర్టర్ వంటి ఆన్లైన్ యాప్స్ ద్వారా డెలివరీలు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

వేప్ విక్రయాలకు సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి బదిలీ అవుతున్నట్లు తెలిపారు పోలీసులు. వేప్ సరఫరా నెట్‌వర్క్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు పోలీసులు. హోలీ స్మోక్ అనే షాపునకు కేరళ నుంచి వేప్ సప్లై అవుతున్నట్లు తెలిపారు పోలీసులు.