మంచిర్యాలలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

మంచిర్యాలలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

మంచిర్యాల, వెలుగు: త్వరలో నిర్వహించే పోలీస్​కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​కు హాజరయ్యే అభ్యర్థులకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ​ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ​నిర్వహించనున్నట్టు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు తెలిపారు. ఈ నెల 20న దివంగత ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా నిపుణులైన 20 మంది ఫ్యాకల్టీతో కోచింగ్ ప్రారంభిస్తామన్నారు.

స్థానిక టీటీడీ ఫంక్షన్​హాల్​లో నిర్వహించే కోచింగ్​ రెండు నెలలు కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, అవసరమైన స్టడీ మెటీరియల్​ఫ్రీగా అందిస్తామని తెలిపారు. దరఖాస్తుల కోసం క్యూఆర్​ కోడ్​ రిలీజ్​ చేశామని, స్కాన్​ చేసి అప్లికేషన్ డౌన్​లోడ్​ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.