ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి.. ఎలా కలుగుతుంది.. ఎలాంటి ఆహారం తినాలి..!

ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి.. ఎలా కలుగుతుంది.. ఎలాంటి ఆహారం తినాలి..!

నోటి మీద అదుపు లేకపోవడం వలన చేప.. స్పర్శ మీద నిగ్రహం లేక ఏనుగు..  వినికిడి మీద నిగ్రహం లేక జింక.. కంటి మీద నిగ్రహం లేక మిడత పతనం అయ్యాయి.వాటికి కేవలం ఒక్క ఇంద్రియం మీద నిగ్రహం లేకపోవడం వల్లనే అవి నాశనమైతే... మనిషికి తన పంచేంద్రియాల మీద నిగ్రహం లేదు. అతడి పతనం ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి..అది  ఎలా కలుగుతుంది..దాని కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

మానవునికి తన కళ్ళ మీద నిగ్రహం లేదు.. ఏవి చూడకూడదో అవే చూస్తున్నాడు. తన చెవుల మీద తనకు నిగ్రహం లేదు, ఏది వినకూడదో అదే వింటున్నాడు. తనకు నోటి మీద నిగ్రహం అసలే లేదు. అనవసరమైనవంతా మాట్లాడుతున్నాడు.

మనం పీల్చే వాసనలు మనలో ఉద్రేకాన్ని కలిగించేవిగా.. తమో గుణాన్ని పెంచేవిగనే ఉంటున్నాయి. స్పర్శ విషయంలో కూడా అంతే. మనం స్వీకరించిన ఆహారంలో ఆరవ వంతు మనస్సుగా మారుతుందని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. ఇంతకీ ఆహరం అంటే ఏంటి.? కేవలం నోటి ద్వారా మాత్రమే తీసుకునేది కాదు.   కళ్ళ ద్వారా చూసేది.. చెవుల ద్వారా వినేది.. ముక్కు ద్వారా వాసన పీల్చేది.. స్పృశించేది కూడా మనస్సుగా మారుతోంది అవన్నీ ఆహారమేనని పండితులు చెబుతున్నారు. 

ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు.. నిషిద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు, మంచి ఆలోచనలు మ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి. మంచి పనులు చేయమంటే ఎలా చేస్తాము. మన శరీరమంతా అశుద్ధమైన, ధర్మబద్ధం కాని, అనైతికమైన ఆహారంతో ఏర్పడుతోంది, దానితోనే నిండుతోంది. అందుకే సమాజంలో మనుషులు పెడద్రోవ పడుతున్నారు....  

ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం . అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది.  

ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి  అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ,వ్యక్తి ఆత్మ స్థైర్యం లభిస్తుంది. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి అభివృద్దికి ఎంతో ఉపయోగపడతాయి.ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు.