సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా ? ఈ సీక్రెట్ ట్రిక్‌తో ఫోన్ జాతకం మొత్తం తెలుసుకోవచ్చు !

సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా ? ఈ సీక్రెట్ ట్రిక్‌తో ఫోన్ జాతకం మొత్తం తెలుసుకోవచ్చు !

ఐఫోన్ కొనడం అంటే కొంచెం ఖర్చుతో  కూడుకున్న పని. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధర దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది. అంత ఖరీదైన ఫోన్ వాడుతున్నప్పుడు ఏదైనా హార్డ్‌వేర్ సమస్య వచ్చినా, లేదా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నా.. దానికి ఆపిల్ వారంటీ లేదా AppleCare+ కవరేజ్ ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ వారంటీ ఉంటే, సర్వీసింగ్ లేదా రిపేర్ల కోసం మీరు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన పని ఉండదు. కంపెనీ ఫ్రీగా లేదా తక్కువ ఖర్చుతో రిపేర్ చేసిస్తుంది.

ఆపిల్ సాధారణంగా ఐఫోన్ కొన్న  రోజు నుంచి ఒక సంవత్సరం పాటు మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలపై వారంటీ ఇస్తుంది. అయితే అనుకోకుండా కిందపడి పగిలిపోవడం లేదా సాధారణ వాడకం వల్ల బ్యాటరీ తగ్గడం వంటివి స్టాండర్డ్ వారంటీ కిందకి రావు. మరి మీ ఐఫోన్‌కు వారంటీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి... చాలా సింపుల్.. దీన్ని తెలుసుకోవడానికి  రెండు  బెస్ట్ మార్గాలు ఇవే:

ఐఫోన్ సెట్టింగ్స్ ద్వారా చెక్ చేయడం
మీ దగ్గర ఐఫోన్ ఉంటే,  ఫోన్ సెట్టింగ్స్ నుంచే వారంటీ గడువు ఎప్పటివరకు ఉందో చూసుకోవచ్చు:
*ఇందుకు ముందుగా మీ ఐఫోన్‌లో Settings యాప్‌ను ఓపెన్ చేయండి.
*కిందకు స్క్రోల్ చేసి General ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
*అక్కడ AppleCare & Warranty అనే ఆప్షన్‌ క్లిక్ చేయండి.
*మీకు కనిపించే డివైజెస్ లిస్ట్ నుంచి మీ iPhone ను సెలెక్ట్ చేసుకోండి.
*వెంటనే మీ ఫోన్‌కు వారంటీ ఉందో లేదో, ఉంటె దాని గడువు తేదీ ఎప్పటివరకు ఉందో స్పష్టంగా చూపిస్తుంది.

ALSO READ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ బంపర్ డిస్కౌంట్స్!

ఆపిల్ వెబ్‌సైట్ ద్వారా సీరియల్ నంబర్‌తో చెక్ చేయడం
మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనాలనుకున్నప్పుడు, ఆ ఫోన్ మీ చేతిలో లేకపోయినా కేవలం దాని సీరియల్ నంబర్  ఉపయోగించి వారంటీ స్టేటస్ తెలుసుకోవచ్చు:

*ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఆపిల్ అఫీషియల్ checkcoverage.apple.com వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
*బాక్స్‌లో మీ ఐఫోన్ సీరియల్ నంబర్ (ఫోన్ లో Settings > General > About లో లేదా బాక్స్‌పై ఉంటుంది) ఎంటర్ చేయండి.
*స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా/వెరిఫికేషన్‌ ఎంటర్ చేసి Submit నొక్కండి.
* ఇప్పుడు ఆ ఫోన్‌కు వారంటీ లేదా AppleCare+ ఉందో లేదో వెబ్‌సైట్ పూర్తి వివరాలను చూపిస్తుంది.