శంషాబాద్ లో కల్తీ మద్యం దందా గుట్టు రట్టయ్యింది. జానీ వాకర్, 100 పైపర్స్ లాంటి ప్రీమియం లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి అమ్ముతున్న ముఠాను మంగళవారం ( నవంబర్ 17 ) అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠాలో డిస్టిలరీ కార్మికుడు వంగరి అశోక్, సాఫ్ట్‌వేర్ వ్యాపారి మహమ్మద్ యాకూబ్ పాషా ఉన్నట్లు తెలిపారు పోలీసులు..
అశోక్ ఇంటిపై దాడి చేసిన అధికారులు పది చీప్ లిక్కర్ నింపిన మద్యం బాటిళ్లతో పాటు 30కి పైగా ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రూ.560 విలువైన డాన్సెన్స్ మద్యం సీసాల నుంచి సుమారు 10 మందికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని... ఈ దందాతో సంబంధం ఉన్న కొనుగోలుదారులపై ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారని తెలిపారు.
ఈ కల్తీ మద్యం దందా బయటపడటంతో మందు బాబుల గుండెల్లో గుబులు మొదలైంది. ప్రీమియం లిక్కర్ కదా అని నమ్మకంతో కొంటుంటే.. వాటిని కూడా కల్తీ చేస్తున్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్. సో.. మద్యం ప్రియులు ఇక మీదట మందు కొనేటప్పడు కొంచెం జాగ్రత్త.
