- భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్
ముల్లాన్‌పూర్: 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇక ప్రయోగాలకు పెద్దగా సమయం లేదని భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. తదుపరి సిరీస్ నుంచే ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటున్న పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలిపాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నప్పటికీ.. చివరి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతూ గాయాలు, ఇతర మ్యాచ్‌లతో కూడిన బిజీ షెడ్యూల్ కారణంగా ఆశించిన బౌలింగ్ కూర్పుతో ఆడలేకపోయామని పేర్కొన్నాడు. బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, అక్షర్ వంటి కీలక బౌలర్లు అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపిందన్నాడు.
ఫీల్డింగ్‌లోనూ మెరుగుపడాలి
పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్ తమను దెబ్బతీసిందని గిల్ అంగీకరించాడు. ఆరంభంలో వికెట్లు తీయకపోతే మధ్య ఓవర్లలో అవకాశాలు సృష్టించడం కష్టమవుతోందన్నాడు. చివరి వన్డేలో మూడు, నాలుగు క్యాచ్‌లు జారవిడిచామని, సిరీస్ మొత్తంలో ఏడు క్యాచ్‌లు వదిలేశామని తెలిపాడు. ప్రపంచకప్‌కు ముందు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. అరంగేట్ర బౌలర్లు ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని, అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడేందుకు సమయం అవసరమని అభిప్రాయపడ్డాడు. జడేజాను జట్టు నుంచి తప్పించలేదని, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల ఎంపికపై సెలెక్టర్లతో చర్చిస్తామని గిల్ వెల్లడించాడు.
