- రాష్ట్రంలోని శ్రావణపల్లి ఓసీపీ, కోయగూడెం-3 బ్లాక్‌లతో పాటు ఒడిశాలోని నైనీ మైన్సమీపంలోని బ్లాక్‌లకు ప్రయారిటీ
కోల్బెల్ట్, వెలుగు: కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నిర్వహించనున్న 16వ విడత వేలంలో నాలుగు బొగ్గు బ్లాక్‌లను దక్కించుకొనేందుకు సింగరేణి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని రెండు గనులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మరో రెండు బ్లాక్‌లను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. గత నెల 25న జరిగిన సింగరేణి బోర్డు మీటింగ్‌లో నాలుగు బ్లాక్‌లకు టెండర్లు దాఖలు చేసే విషయంపై సింగరేణి సీఎండీ, ఆఫీసర్లు చర్చించారు.
సీఎండీ ఆదేశాలతో డిసెంబర్ 3న నిర్వహించే వేలం పాటలో పాల్గొనేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఈ నాలుగు బొగ్గు బ్లాక్‌లకు సంబంధించి టెండర్ ఫారాలు కూడా కొనుగోలు చేసిందని, అక్టోబర్ 16లోపు దాఖలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు చెందిన 25 బొగ్గు బ్లాక్‌లను ఆక్షన్‌లో చేర్చింది. ఇందులో 21 బ్లాక్‌లు పూర్తిగా సర్వే చేసినవి కాగా, నాలుగు పాక్షికంగా సర్వే చేసినవి ఉన్నాయి. బొగ్గు బ్లాక్ల బిడ్డింగ్ ప్రక్రియ గత నెల 17న ప్రారంభం కాగా, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు బొగ్గు బ్లాక్ల కోసం బిడ్ల స్వీకరణ మొదలుపెట్టాయి. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గల సంస్థలు ఈ నెల 16లోగా బిడ్లు అందజేయాల్సి ఉంటుంది.
డిసెంబర్ 3న వేలం నిర్వహించనున్నారు. వేలం లిస్ట్‌లో రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం ఓసీపీ-3 బొగ్గు బ్లాక్‌లు ఉన్నాయి. ఈ రెండు బ్లాక్‌లు సింగరేణి మైనింగ్‌లకు సమీపంలో ఉన్నాయి. సింగరేణి సంస్థ మనుగడ, భవిష్యత్తు అవసరాలకు ఈ గనులు కీలకం కావడంతో వీటిని దక్కించుకోవడానికి టెండర్లలో పాల్గొనాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించినప్పటికీ, సింగరేణి ఉనికిని కాపాడుకోవడానికి వేలంలో పాల్గొనాలని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చింది.
మరో రెండు మైన్లపై దృష్టి
తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీపీ, కోయగూడెం3 ఓసీపీ బ్లాక్‌లను వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం.. ఇతర రాష్ట్రాల్లోని మరో రెండు బ్లాక్లపై కూడా దృష్టి సారించింది. వీటి కోసం బిడ్లు దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. సింగరేణి చరిత్రలో తొలిసారిగా బయట రాష్ట్రమైన ఒడిశాలో దక్కించుకున్న నైనీ కోల్‌బ్లాక్‌లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నైనీ బ్లాక్‌కు సమీపంలో ఉన్న పలు బొగ్గు బ్లాక్‌లను కూడా ఈ దఫా వేలం ప్రక్రియలో చేర్చారు.
అందులో న్యూపాత్రపార, నువగావ్ తెలిసాహి, అర్ఖపాల్ శ్రీరాంపూర్, మీనాక్షి సెంట్రల్ బ్లాక్ ఉన్నాయి. ఇవన్నీ ఒడిశాలోని తాల్చేర్ బొగ్గు క్షేత్రాల పరిధిలోని ఛెందిపద బెల్ట్‌లోనే ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. సింగరేణి కంపెనీకి చెందిన నైనీ బొగ్గు బ్లాక్‌కు ఇవి కేవలం 20 కిలోమీటర్ల లోపు ఉన్నాయి. వీటిలో ఒక్కదాన్ని దక్కించుకుంటే ప్రస్తుత నైనీ బ్లాక్ మైనింగ్ కార్యకలాపాలతో దీన్ని అనుసంధానం చేసే అవకాశం ఉండడంతో సింగరేణి కంపెనీ బ్లాక్‌లకు టెండర్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బ్లాక్‌లకు కూడా ప్రయారిటీ ఇచ్చే అవకాశంఉంది.
