తెలుగు రాష్ట్రాల్లో పండగ సీజన్ మొదలైంది, సాధారణంగా ప్రజలు ఎక్కువగా పండగ రోజుల్లో కొత్త వాహనాలు కొనేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ట్రెండ్ నడుస్తుంది. దీని వల్ల సామాన్యులకు పెట్రోల్ భారం కూడా తగ్గుతుంది. మీరు కూడా మీ ఇంటి పనులకు, రోజు ప్రయాణాలకి బడ్జెట్‌కు అనుకూలమైన, ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా.. అయితే ద్విచక్ర వాహనాలు సంస్థ TVSకి చెందిన TVS ఆర్బిటర్ V2 (TVS Orbiter V2) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన ఈ వివరాలు మీకోసం.
TVS ఆర్బిటర్ V2 గరిష్టంగా 2.5 kW శక్తిగల BLDC హబ్ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 68 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో కేవలం 6.8 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. ఇందులో ఎకో, సిటీ మోడ్‌లతో పాటు, పార్కింగ్, రివర్స్ అసిస్ట్ కోసం ఖావోస్ మోడ్ కూడా ఉంది.
TVS ఆర్బిటర్ V2 ఫీచర్లు
ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో LCD డిస్‌ప్లే ఉంటుంది, ఇది TVS SmartXonnect యాప్‌కు సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ & SMS అలర్ట్‌లు లభిస్తాయి. సేఫ్టీ ఫీచర్లలో ఆటో హిల్ హోల్డ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, క్రాష్/ఫాల్ అలర్ట్, జియో-ఫెన్సింగ్, టోయింగ్ అలర్ట్ ఉన్నాయి. సీటు కింద 34 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది.
కలర్ అప్షన్స్
రైడర్ సౌకర్యం కోసం, ఇందులో క్రూజ్ కంట్రోల్, రివర్స్ & ఫార్వర్డ్ పార్కింగ్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, మార్టియన్ కాపర్, కాస్మిక్ టైటానియం, స్టెల్లార్ సిల్వర్, లూనార్ గ్రే కలర్లో లభిస్తుంది.
►ALSO READ | దీపావళికి షియోమీ ధమాకా గిఫ్ట్.. ఎలక్ట్రానిక్స్ పై ఏకంగా 50% వరకు డిస్కౌంట్లు.. ఇవన్నీ సగం ధరకే..
దీనిలో IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయిన 3.1kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 158 కి.మీ (IDC) వరకు రేంజ్ అందిస్తుంది. దీనితో పాటు వచ్చే పోర్టబుల్ ఛార్జర్‌ను ఉపయోగించి 0-80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 10 నిమిషాల సమయం పడుతుంది. దీని ఛార్జర్ అవుట్‌పుట్ 650W.
సస్పెన్షన్ & బ్రేకులు
ఈ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ ఇంకా వెనుకవైపు ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. సేఫ్టీ కోసం, ముందు ఇంకా వెనుక చక్రాలు రెండింటికీ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు. దీనికి ముందువైపు 14-అంగుళాల అల్లాయ్ వీల్, వెనుకవైపు 12-అంగుళాల వీల్ ఉన్నాయి, ఈ రెండూ ట్యూబ్‌లెస్ టైర్లు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.19 లక్షలు. ఈ దీపావళికి మంచి మైలేజ్, లుక్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కోనాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు!
