దీపావళికి షియోమీ ధమాకా గిఫ్ట్.. ఎలక్ట్రానిక్స్ పై ఏకంగా 50% వరకు డిస్కౌంట్లు.. ఇవన్నీ సగం ధరకే..

దీపావళికి షియోమీ ధమాకా గిఫ్ట్.. ఎలక్ట్రానిక్స్ పై ఏకంగా 50% వరకు డిస్కౌంట్లు.. ఇవన్నీ సగం ధరకే..

స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ 'దీపావళి విత్ షియోమీ సేల్ 2026'ను ప్రారంభించబోతుంది. అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమయ్యే ఈ సేల్‌లో, వివిధ ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్స్  ఇస్తున్నట్లు కంపెనీ చెబుతుంది. అయితే కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌లపై రూ.15,000 వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు  ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.

కంపెనీ   ఫ్లాగ్‌షిప్ షియోమీ 17 అల్ట్రా రూ.1,29,999 ధరపై రూ.10 వేల ఎక్స్ట్రా  సేవింగ్స్  అలాగే  ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా, ఈ ఫోన్‌ను కొనే  వారికి రూ.19,999 విలువైన 'ఫోటోగ్రఫీ కిట్ ప్రో' ఫ్రీగా లభిస్తుంది. ఈ మధ్య విడుదలైన ఈ రెడ్‌మీ నోట్ 17 సిరీస్‌పై  ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తుంది. 

Xiaomi ప్రకటన ప్రకారం, బడ్జెట్ Redmi Note 15 SE నుండి ప్రీమియం Xiaomi 17 సిరీస్ వరకు అన్ని ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుంది.  ఈ సేల్‌లోని కొన్ని బెస్ట్ డీల్స్‌ మీకోసం.....

రెడ్‌మి నోట్ 15 SE ఆఫర్లు
మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 15 SE  బేస్ వేరియంట్ (6GB + 128GB) డిస్కౌంట్ల తర్వాత రూ. 22,999కి లభిస్తుంది. పోల్చి చూస్తే, ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 25,999కి లాంచ్ అయ్యింది. ఇంకా 8GB + 128GB వేరియంట్ డిస్కౌంట్ల తర్వాత రూ. 24,999కి... 8GB + 256GB వేరియంట్ రూ.26,999కి లభిస్తుంది. 

రెడ్‌మి టర్బో 5 5G ఆఫర్‌లు
బ్యాంకు డిస్కౌంట్ల తర్వాత రెడ్‌మి టర్బో 5 ధర రూ.37,999కి తగ్గనుంది. ప్రస్తుతం, షియోమి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధర రూ.41,999గా ఉంది.

Xiaomi 17T, 17 Ultra సిరీస్ ధర
కంపెనీ ప్రీమియం మోడళ్లపై కూడా డిస్కౌంట్‌లు ఇస్తుంది. షియోమీ 17T డిస్కౌంట్‌తో రూ. 64,999కి లభిస్తుంది. షియోమీ 17 అల్ట్రా బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 1,29,999కి వస్తుంది. 

రెడ్‌మి నోట్ 17 సిరీస్ ధరలు 
ఆఫర్లు ఇంకా  బ్యాంక్ డిస్కౌంట్ల తర్వాత రెడ్‌మి నోట్ 17 5G  ధర రూ.26,000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. మరోవైపు, రెడ్‌మి నోట్ 17 ప్రో  రూ.33,999కి,  టాప్-ఎండ్ రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ రూ.44,999కి లభిస్తుంది.

గమనిక: ఈ పండగ ఆఫర్లు బడ్జెట్ ఫోన్లయిన రెడ్‌మి నోట్ 15 SE నుండి, అత్యంత ఖరీదైన ప్రీమియం షియోమీ 17 సిరీస్ వరకు అన్ని మోడళ్లపై ఉన్నాయి. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే అక్టోబర్ 8 నుండి ప్రారంభమయ్యే ఈ సేల్‌ను ఉపయోగించుకోండి!