13 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత్‌లో GTA 6 లాంచ్: ధర, డౌన్‌లోడ్ స్టెప్స్ తెలుసుకోండి!

13 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత్‌లో GTA 6 లాంచ్: ధర, డౌన్‌లోడ్ స్టెప్స్ తెలుసుకోండి!

GTA 6 Officially Launches in India : గేమింగ్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI (GTA 6) ఎట్టకేలకు భారత్‌లో అధికారికంగా విడుదలైంది. ఈరోజు (గురువారం, నవంబర్ 19, 2026) అర్ధరాత్రి 12:00 AM IST నుంచి ఈ గేమ్ భారతీయ గేమర్లకు అందుబాటులోకి వచ్చింది. రాక్‌స్టార్ గేమ్స్ (Rockstar Games) రూపొందించిన ఈ మాస్టర్‌పీస్, 2013లో వచ్చిన GTA 5 తర్వాత సరిగ్గా 13 ఏళ్లకు లాంచ్ అయింది. ప్రస్తుతం PlayStation 5 (PS5), Xbox Series X|S కన్సోల్స్‌లో మాత్రమే ఈ గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. వైస్ సిటీ (Vice City), లియోనిడా (Leonida) నేపథ్యంలో జేసన్, లూసియా అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ కొనసాగే ఈ ఓపెన్-వరల్డ్ గేమ్‌ను ఎలా కొనుగోలు చేయాలి? ధర ఎంత? అనే పూర్తి వివరాలని ఇప్పుడు V6 వెలుగు వెబ్సైట్లో చూడండి.. 

భారత్‌లో GTA 6 ధరలు, స్పెషల్ ఆఫర్: 

భారతీయ గేమర్ల కోసం ప్లేస్టేషన్ స్టోర్, ఎక్స్‌బాక్స్ స్టోర్లలో రెండు ఎడిషన్లను అందుబాటులో ఉంచారు. స్టాండర్డ్ ఎడిషన్ (Standard Edition) ధర ₹5,999 కాగా, ఎక్స్ట్రా డిజిటల్ కంటెంట్‌తో కూడిన అల్టిమేట్ ఎడిషన్ (Ultimate Edition) ధర ₹7,499 గా నిర్ణయించారు. అంతేకాకుండా, నవంబర్ 20, 2026లోపు డిజిటల్ ఎడిషన్ కొనుగోలు చేసే వారికి ప్రమోషనల్ వింటేజ్ వైస్ సిటీ ప్యాక్ (Vintage Vice City Pack) తో పాటు ఒక నెల GTA+ మెంబర్‌షిప్ ఫ్రీగా లభిస్తుంది.

PS5, Xboxలో GTA 6 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?: 

* PlayStation 5 యూజర్ల కోసం: మీ PS5 ఆన్ చేసి ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయండి.. అనంతరం PlayStation Store ఓపెన్ చేసి Grand Theft Auto VI అని సెర్చ్ చేయండి.. మీకు నచ్చిన స్టాండర్డ్ లేదా అల్టిమేట్ ఎడిషన్ ఎంచుకుని పేమెంట్ పూర్తి చేస్తే, గేమ్ లైబ్రరీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* Xbox Series X|S యూజర్ల కోసం: Xbox కన్సోల్‌లో Microsoft Xbox Store లోకి వెళ్లి Grand Theft Auto VI సెర్చ్ చేయండి. ఎడిషన్ సెలక్ట్ చేసుకుని పేమెంట్ పూర్తి చేసిన వెంటనే కన్సోల్ లైబ్రరీ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.. ఇప్పటికే ప్రీ-లోడ్ చేసుకున్న వారు నేరుగా గేమ్ ఆడటం ప్రారంభించవచ్చు.

ఫిజికల్ కాపీ, పీసీ (PC) వెర్షన్: 

బయట మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఫిజికల్ బాక్స్ కొనుగోలు చేసే వారికి సాధారణ గేమ్ డిస్క్‌కు బదులుగా కోడ్-ఇన్-బాక్స్ (Code-in-box) ప్యాకేజీ లభిస్తుంది. బాక్స్ లోపల ఉండే డిజిటల్ డౌన్‌లోడ్ కోడ్‌ను మీ కన్సోల్ స్టోర్‌లో రిడీమ్ చేసుకుని గేమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి (కొనేముందు రీజియన్ కంపాటిబిలిటీ చూసుకోవాలి).. ఇక కంప్యూటర్ గేమర్లకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం పీసీ (PC) వెర్షన్‌ను రాక్‌స్టార్ గేమ్స్ రిలీజ్ చేయలేదు. అలాగే PS4, Xbox One లేదా మొబైల్ ఫోన్లలో నేరుగా ఈ గేమ్ పని చేయదు. కన్సోల్స్‌లో గేమ్ ఇన్‌స్టాల్ చేయడానికి కనీసం 212 GB ఫ్రీ స్టోరేజ్ స్పేస్ ఖాళీగా ఉంచుకోవాలి.