టోటల్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ అదుర్స్.. డచ్ ఆటగాడిపై విజయం

టోటల్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ అదుర్స్.. డచ్ ఆటగాడిపై విజయం

బుడాపెస్ట్‌‌‌‌: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. టోటల్‌‌‌‌ చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టూర్‌‌‌‌ పైలట్‌‌‌‌ క్లాసిఫికేషన్‌‌‌‌ గేమ్‌‌‌‌ల్లో సత్తా చాటాడు. 9, 12 స్థానాల కోసం బుధవారం జరిగిన పోరులో అర్జున్‌‌‌‌.. జోర్డెన్‌‌‌‌ వాన్‌‌‌‌ ఫోరెస్ట్‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌)పై గెలిచాడు. నాలుగు బ్లిట్జ్‌‌‌‌ గేమ్‌‌‌‌ల్లో మూడింటిని, రెండు ర్యాపిడ్‌‌‌‌ గేమ్‌‌‌‌ల్లో రెండింటిని అర్జున్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. ఫాస్ట్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌ గేమ్‌‌‌‌ డ్రా కాగా.. మొత్తంగా అర్జున్‌‌‌‌ 11.5–8.5 తేడాతో విజయం సాధించాడు. 

21 నుంచి 24 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌‌‌‌ల్లో ప్రజ్ఞానంద ఆరంభంలో వెనుకబడినా.. తర్వాత పుంజుకున్నాడు. బ్లిట్జ్‌‌‌‌ రౌండ్‌‌‌‌ ముగిసేసరికి 1–3తో వెనుకంజలో ఉన్న ప్రజ్ఞా తొలి ర్యాపిడ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో నెగ్గి, ఫాస్ట్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌ గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. దాంతో 11–9తో నొడిర్బెక్‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌పై నెగ్గాడు. గ్రాండ్‌‌‌‌మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. వైశాలి 7–13తో అభిమన్యు మిశ్రా చేతిలో ఓడింది. రెండు బ్లిట్జ్‌‌‌‌, ర్యాపిడ్‌‌‌‌ గేమ్‌‌‌‌ల్లో వైశాలి పరాజయం చవిచూసింది.