హైకోర్టులో మెగా మెడికల్ క్యాంప్..ప్రారంభించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ పి.శ్యామ్‌‌‌‌ కోషి

హైకోర్టులో మెగా మెడికల్ క్యాంప్..ప్రారంభించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ పి.శ్యామ్‌‌‌‌ కోషి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా మెడికల్​క్యాంప్​ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ పి.శ్యామ్‌‌‌‌ కోషి బుధవారం ప్రారంభించారు. హైకోర్టు అడ్వకేట్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు ఎస్‌‌‌‌.సురేందర్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ శిబిరాన్ని ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు.

న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బందికి వైద్య సేవలందించడమే లక్ష్యంగా హైకోర్టు ప్రాంగణంలోని నూతన ఫైలింగ్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ సెల్లార్‌‌‌‌లో ఈ క్యాంప్​ను ఏర్పాటు చేశారు. 100కు పైగా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.సుదర్శన్‌‌‌‌రెడ్డి, బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రామ్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.