వెలుగు స్పెషల్ : నేటి తరానికి మార్గదర్శి ..బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహానేత

వెలుగు స్పెషల్ : నేటి తరానికి మార్గదర్శి  ..బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహానేత

పేదలకు గూడు,  కార్మికులకు భరోసా,  అట్టడుగు వర్గాలకు విద్య,  తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం, అట్టడుగు వర్గాల అభ్యున్నతే తన జీవిత ధ్యేయంగా భావించి... పేదలు,  కార్మికులు, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహానేత గడ్డం వెంకటస్వామి.   ‘కాకా’ జయంతి  సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.  

ప్రజా జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన కాకా వెంకటస్వామి తన ప్రత్యేక రాజకీయ శైలి,  ప్రజా సమస్యల పట్ల నిబద్ధత, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన అభిమానంతో  దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ కోసం జరిగిన తొలి దశ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కాకా వెంకటస్వామి పేరు ప్రత్యేకంగా వినిపించింది.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని జీవితాంతం ఆకాంక్షించిన కాకా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కలను కళ్లారా చూశారు. తెలంగాణ కోసం ఆయన చేసిన రాజకీయ, ప్రజా పోరాటాలను రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.  

కాకా సదా చిరస్మరణీయుడు          
                                                                                              
కాకా వెంకటస్వామి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు, ఆయన ఆలోచనలు, ఆయన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి. కార్మికుడికి భద్రత ఉండాలి. ప్రతి పేద పిల్లవాడికి విద్య అందాలి. అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. 

సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యాల కోసం ఆయన సాగించిన ప్రయాణం భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం అంటే  ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడం, పేదలు. కార్మికులు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. 

తీగల అశోక్ కుమార్ , జాతీయ అధ్యక్షుడు,  ఎస్సీ సంక్షేమ సంఘం  

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.