సూర్య హీరోగా, జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. డిఫెరెంట్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్, సూర్య యాక్టింగ్, డైరెక్టర్ జిత్తు మాధవన్ మార్క్ క్రైమ్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే, బాక్సాఫీస్ వద్ద విసక్సెస్ ఫుల్గా దూసుకెళ్తున్న ఈ సినిమాపై ఇప్పుడు కాపీ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 2013లో విడుదలైన హాంకాంగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్ డిటెక్టివ్’ కథతో ‘సీన్’కు చాలా పోలికలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలికలేంటి? ‘సీన్’ విజయానికి కారణాలేంటి? అనేది ఓ తెలుసుకుందాం..
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ‘సీన్’..
సూర్య హీరోగా నటించిన ‘సీన్’ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇందులో ఆయన డీఎస్పీ ప్రేమ్ రాజ్ పాత్రలో కనిపించారు. విధి నిర్వహణలో ఎదురైన పరిస్థితుల కారణంగా దాదాపు 90 శాతం చూపు కోల్పోయిన పోలీస్ అధికారిగా సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చూపు సరిగా కనిపించకపోయినా తన వినికిడి శక్తి, జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యంతో క్లిష్టమైన కేసులను ఛేదించే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలకు భిన్నంగా.. చూపు లేని అధికారి నేరాలను ఎలా గుర్తిస్తాడు? ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితుల్లో ఆధారాలను ఎలా విశ్లేషిస్తాడు? తన ఊహాశక్తితో నేరం జరిగిన తీరును ఎలా పునర్నిర్మిస్తాడు? అనే అంశాలు కథలో ఆసక్తిని పెంచుతాయి.
‘బ్లైండ్ డిటెక్టివ్’తో పోలికలేంటి?
‘సీన్’ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా కథపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2013లో హాంకాంగ్ దర్శకుడు జానీ టో తెరకెక్కించిన ‘బ్లైండ్ డిటెక్టివ్’ చిత్రంతో ‘సీన్’కు పోలికలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘బ్లైండ్ డిటెక్టివ్’లో ఆండీ లా జాన్‌స్టన్ చోంగ్ అనే మాజీ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. విధి నిర్వహణలో చూపు కోల్పోయిన ఆయన ఉద్యోగానికి దూరమైనప్పటికీ, తనకున్న ప్రత్యేకమైన పరిశీలనా శక్తితో నేరాలను ఛేదిస్తుంటారు. అటు ‘సీన్’లోనూ సూర్య దాదాపు చూపు కోల్పోయిన పోలీస్ అధికారిగా కనిపిస్తారు. కళ్లు సరిగా కనిపించకపోయినా తమ తెలివితేటలు, జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యంతో కేసులను పరిష్కరించే ఈ రెండు పాత్రల మధ్య పోలికలు ఉన్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
హీరోకు అసిస్టెంట్గా హీరోయిన్..
ఈ రెండు సినిమాల మధ్య మరో ముఖ్యమైన పోలిక హీరోలకు సహకరించే మహిళా పాత్రలు. ‘బ్లైండ్ డిటెక్టివ్’లో సామీ చెంగ్ పోషించిన గోల్డీ హో పాత్ర హీరోకు అండగా నిలుస్తుంది. అతనికి కళ్లుగా మారి కేసుల దర్యాప్తులో సహాయం చేస్తుంది. అదే తరహాలో ‘సీన్’లో నజ్రియా నజీమ్ పోషించిన మాయ పాత్ర కూడా ఇన్బరాజ్‌కు సహకరిస్తుంది. అతని చూపు సమస్యను ఇతరులకు తెలియకుండా చూస్తూ, దర్యాప్తులో అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. కార్యాలయంలో పైఅధికారుల ముందు అతనికి అండగా నిలవడం, బయట కేసుల విచారణ సమయంలో దారి చూపించడం వంటి సన్నివేశాల్లోనూ రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మార్చురీ సీన్లు.. ఇన్వెస్టిగేషన్‌లోనూ పోలికలా?
ప్రధాన పాత్రలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ‘బ్లైండ్ డిటెక్టివ్’ను గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మార్చురీ సీన్లు, కనిపించకుండా పోయిన యువతికి సంబంధించిన మృతదేహం చుట్టూ సాగే ఎపిసోడ్లు, నేరం జరిగిన తీరును ఊహిస్తూ దర్యాప్తు చేసే విధానం రెండు సినిమాల్లోనూ ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు చిత్రాల్లోని సన్నివేశాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సన్నివేశాల చిత్రీకరణ, పాత్రల ప్రవర్తన, ఇన్వెస్టిగేషన్ సాగించే విధానంలోనూ సారూప్యతలు కనిపిస్తున్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ‘సీన్’పై కాపీ ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
#scene copy cat of Blind Detective 2013 movie. What ra #Jithumadhavan https://t.co/DSF1NLKSzY
— Sundar (@tamizhan26521) November 12, 2026
జిత్తు మాధవన్ మార్క్ మార్పులు ఉన్నా..
అయితే ‘సీన్’లో సెకండాఫ్ నుంచి జిత్తు మాధవన్ తనదైన శైలిలో కామెడీ, విచిత్రమైన పాత్రలు, కథనంలో మార్పులను జోడించారని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే మలుపులు సినిమాకు ప్రత్యేకమైన ముగింపును ఇచ్చాయని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ప్రధాన కథాంశం, హీరో పాత్ర స్వభావం, సహాయకురాలి పాత్ర, కొన్ని కీలక సన్నివేశాల విషయంలో ‘బ్లైండ్ డిటెక్టివ్’ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు మాత్రం తగ్గడం లేదు.
అధికారిక రీమేక్ హక్కులు తీసుకున్నారా?
ఈ వివాదం నేపథ్యంలో మరో ప్రశ్న కూడా చర్చకు వస్తోంది. ‘బ్లైండ్ డిటెక్టివ్’ కథ ఆధారంగా ‘సీన్’ను తెరకెక్కించారా? అలా అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను అధికారికంగా తీసుకున్నారా? లేక కేవలం స్ఫూర్తి పొందారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై దర్శకుడు జిత్తు మాధవన్ లేదా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
‘సీన్’ విజయానికి కారణాలేంటి?
‘సీన్’ సినిమాకు సూర్య నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చూపు కోల్పోయిన పోలీస్ అధికారిగా ఆయన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు దర్శకుడు జిత్తు మాధవన్ తనదైన కామెడీ, ఆసక్తికరమైన పాత్రలు, ఊహించని మలుపులతో క్రైమ్ థ్రిల్లర్‌ను వినోదాత్మకంగా తెరకెక్కించారు. నజ్రియా నజీమ్ పోషించిన మాయ పాత్ర కూడా కథకు బలంగా నిలిచింది. సూర్య నటన, కామెడీ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కలగలిసి సినిమాకు మంచి ఆదరణ తీసుకొచ్చాయి.
బాక్సాఫీస్ వద్ద ‘సీన్’ జోరు..
‘సీన్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నవంబర్ 6న విడుదలైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఇండియాలో రూ.168.50 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.88 కోట్ల వసూళ్లు ఉన్నాయి. దేశీయంగా నెట్ కలెక్షన్లు రూ.145.05 కోట్లకు చేరుకున్నాయి.
తమిళ వెర్షన్ నుంచే అత్యధిక వసూళ్లు రావడం విశేషం. ఇప్పటివరకు తమిళంలో రూ.116 కోట్ల నెట్, తెలుగులో రూ.29.05 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. విడుదలైన మొదటి వారంలోనే రూ.111.70 కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం రెండో వారంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. అయితే రెండో వారం నుంచి రోజువారీ వసూళ్లలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్కును అందుకునే దిశగా సినిమా ముందుకెళ్తోంది. దీంతో సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘సీన్’ నిలుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
A MASSIVE #SCENE AT THE BOX-OFFICE! 260 Cr+ Worldwide Collection! 💥 Running Successfully in Cinemas Now! @Suriya_offl @jithumadavan #Jyotika #NazriyaFahadh #Naslen @sushintdt @Ashwini90372999 @masharhamsa_ @_VishnuGovind @ChethanDsouza @Dravid_Selvam @rajpriyan007 @kabilanchelliah @ZhagaramOffl @rajsekarpandian @SakthiFilmFctry @pharsfilm @SonyMusicSouth @SceneTheMovie @Linqmarqet @prosathish
— 2D Entertainment (@2D_ENTPVTLTD) November 16, 2026
