అయోధ్య: విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈఓ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. సీఈఓ పోస్టు కోసం 5,300 మందికి పైగా దరఖాస్తులు రాగా.. వారిలో 18 మందిని ఇంటర్వ్యూలకు సెలెక్ట్ చేసినట్టు ఆలయ వర్గాలు సోమవారం తెలిపాయి. అడ్మినిస్ట్రేషన్‌లో మంచి అనుభవం ఉన్న క్యాండిడేట్లకు ప్రయారిటీ ఇస్తామని పేర్కొన్నాయి.
సెలెక్ట్ అయిన 18 మందికి ఆగస్టు 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, షిర్డీ సాయిబాబా ట్రస్ట్ మాజీ చైర్మన్, శాస్త్రవేత్త సురేశ్ హవారేలతో కూడిన హైపవర్ ప్యానెల్ ఈ ఇంటర్వ్యూలు చేయనుంది.
