బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో12 గంటల తర్వాత వర్షాలకు ఛాన్స్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో12 గంటల తర్వాత వర్షాలకు  ఛాన్స్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మయన్మార్ తీర ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) 2026 సెప్టెంబర్ 30న వెల్లడించింది.  

ఇది గత ఆరు గంటలుగా గంటకు సుమారు 13 కి.మీ. వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.  ప్రస్తుతం ఇది మయన్మార్‌లోని మిండాట్ సమీపంలో కదులుతోంది. హఖా నుంచి దక్షిణ -ఆగ్నేయంగా 140 కి.మీ., బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ నుంచి తూర్పు-ఆగ్నేయంగా 250 కి.మీ., మిజోరంలోని లెంగ్‌పుయి నుంచి దక్షిణ-ఆగ్నేయంగా 310 కి.మీ., మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి దక్షిణంగా సుమారు 370 కి.మీ. దూరంలో ఉందని అధికారులు తెలిపారు.

IMD ప్రకారం, ఈ అల్పపీడనం ఉత్తర-వాయవ్య దిశగా కొనసాగుతూ క్రమంగా బలహీనపడుతుంది. తర్వాత 24 గంటల్లో ఆగ్నేయ బంగ్లాదేశ్, మయన్మార్ సమీప ప్రాంతాల వైపు కదలుతుంది. మిజోరం, త్రిపురలో వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. 

►ALSO READ | హైదరాబాద్ లో హోటళ్లు బయట ఫైవ్ స్టార్ లుక్... లోపల కంపు కొట్టే కిచెన్స్: TG SAFE కమిషనర్ అవినాష్ మహంతి

అండమాన్  నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవవచ్చు. అదే విధంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.