హైదరాబాద్ లో హోటళ్ల పరిస్థితి బయట ఫైవ్ స్టార్ లుక్, లోపల కంపుకొట్టే కిచెన్ అన్నట్టు తయారయ్యిందని అన్నారు TG SAFE కమిషనర్ అవినాష్ మహంతి. బుధవారం ( సెప్టెంబర్ 30 ) V6 న్యూస్ తో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు అవినాష్ మహంతి. ప్రజల ఆరోగ్యంతో రాజీ లేదని.. ఫుడ్ సేఫ్టీ , డ్రగ్ సేఫ్టీ విషయంలో జీరో టాలరెన్స్ పాటిస్తున్నామని స్పష్టం చేశారు. నెల రోజుల వ్యవధి లో 50 మందికి సస్పెండ్ నోటీసులు ఇచ్చామని.. కల్తీ ఆహారం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవుని అన్నారు.
డేంజర్ కిచెన్లు మెయింటైన్ చేస్తున్న బ్రాండెడ్ హోటళ్లకు నోటీసులు ఇచ్చామని.. కిచెన్లలో బొద్దింకలు.. ఎలుకలు, ఈగలు ఉన్న ఫుడ్ కోర్టులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. చాలా హోటల్లో ఫ్రిజ్‌లలో పచ్చి మాంసం.. వెజీటీరియన్ ఫుడ్ ఒకే చోట ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
మరో పక్క స్వీట్ షాప్స్ లోని కిచెన్లలో కుళ్లిపోయిన వస్తువులు, ఫుడ్‌లో పురుగులు, బూజు పట్టిన జీడిపప్పు గుర్తించామని తెలిపారు. ఎలుకలు కొరికిన మయోనైజ్ ప్యాకెట్లు, ఎక్స్‌పైర్డ్ ఫుడ్ గుర్తించామని అన్నారు. డార్క్ స్టోర్లపై ఆబ్జెర్వేషన్ పెట్టి తనిఖీలు చేశామని.. క్విక్ కామర్స్ స్టోర్లలో క్వాలిటీపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
ఒక్కసారి రైడ్ చేసి వదిలేయకుండా.. రిపీట్ ఆఫండర్స్ పై నిరంతర నిఘా ఉంచుతున్నామని అన్నారు అవినాష్ మహంతి. లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన ఫుడ్ శాంపిల్స్ పై Laboratory టెస్టింగ్ .. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
►ALSO READ | కుక్క కాటును లైట్ తీసుకోకండి.. హైదరాబాద్లో రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
ఇక డ్రగ్ సేఫ్టీ విషయానికి వస్తే... నకిలీ, నాసిరకం మందుల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని...ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించే మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని...గడువు ముగిసిన మెడిసిన్స్ , స్పూరియస్ డ్రగ్స్ , మిస్బ్రాండెడ్ డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు.
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలని అన్నారు. ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తామని.. సమాచారం అందితే వెంటనే తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే కాదు.. ప్రజల్లో ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీపై అవగాహన కూడా పెంచుతామని అన్నారు అవినాష్ మహంతి.
