రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పంటల కనీస మద్దతు ధర పెంపు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పంటల కనీస మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2027–28 ఏడాదికి గానూ ఆరు పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‎పీ) పెంచింది. గోధుమ, కంది, బార్లీ, శనగ, ఆవాలు, కుసుమ పంటల ఎంఎస్‎పీ హైక్ చేసింది. బుధవారం (సెప్టెంబర్ 30) ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు గానూ మొత్తం ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర పెంపుకు పచ్చజెండా ఊపింది. 

క్వింటాకు రూ.25 చొప్పున పెంచడంతో గోధుమల కనీస మద్దతు ధర రూ.2,610కి చేరింది. కుసుమ పంటకు క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 675 పెరిగింది. దీనితో కుసుమ పంటకు క్వింటాల్‌ ధర రూ. 7,215కి చేరింది. ఆవాలు రూ. 413 పెంపుతో క్వింటా ధర రూ. 6,613కి చేరింది. 

►ALSO READ | పాత ఇళ్లు, అపార్ట్మెంట్స్ కొంటున్నారా..? ఈ 7 విషయాలు చెక్ చేయకపోతే డబ్బులు గంగలో పోసినట్లే!

మసూర్ రూ. 390 పెరిగి క్వింటా ధర రూ.7,390కి చేరింది. శనగలు రూ. 83 మేర పెరిగి క్వింటా ధర రూ. 5,958 కి చేరింది. బార్లీ రూ. 136 పెరిగి క్వింటా రూ. 2,286కి చేరింది. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించడం, పంటల వైవిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.