పైలట్ విమానాన్ని కూల్చివేయాలని అనుకుండు: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇజ్రాయెల్ PM సంచలన వ్యాఖ్యలు

పైలట్ విమానాన్ని కూల్చివేయాలని అనుకుండు: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇజ్రాయెల్ PM సంచలన వ్యాఖ్యలు

టెల్‎అవీవ్: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలట్‎పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేయడానికి కో పైలట్ ప్రయత్నించాడని అన్నారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో అధికశాతం ఇజ్రాయెల్ ప్రయాణికులే ఉన్నారని తెలిపారు. ప్రయాణికులు ధైర్యంగా పోరాడి భారీ విపత్తును తప్పించారని అభినందించారు. విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించిన పైలట్‎ను సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారని తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఈ ఘటనను ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..?

బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్‎లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్‎కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్‎లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్‎పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది. 

విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్‎పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్‎పై దాడి చేసిన కో పైలట్‎ను అదుపులోకి తీసుకున్నారు. 

►ALSO READ | గాల్లో ఉండగానే.. విమానం పైలెట్లు కొట్టుకున్నారు.. రక్తం కారుతూ ఫ్లైట్ ల్యాండ్ చేశారు..!

అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్‎ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్‎ను ఆసుపత్రికి తరలించారు. కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించినట్లు సౌదీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.