గాల్లో ఉండగానే.. విమానం పైలెట్లు కొట్టుకున్నారు.. రక్తం కారుతూ ఫ్లైట్ ల్యాండ్ చేశారు..!

గాల్లో ఉండగానే.. విమానం పైలెట్లు కొట్టుకున్నారు.. రక్తం కారుతూ ఫ్లైట్ ల్యాండ్ చేశారు..!

ఆకాశంలో హైఓల్టేజ్ డ్రామా జరిగింది.  సినిమా సీన్స్ ను తలపించేలా ఫ్లైట్ ను హైజాక్ చేసే ప్రయత్నం జరిగింది. పైలట్ ను కత్తితో పొడవడంతో విమానం ఏకంగా 17 వేల అడుగులు కిందికి జారిపోయి దాదాపు క్రాష్ అయినంత పని అయ్యింది. అంతలోనే మళ్లీ పైకి లేవడం.. ప్రయాణీకులు ఆల్మోస్ట్ చనిపోయామని అనుకునే లోపే మిరాకిల్ జరిగటం.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన 2026 సెప్టెంబర్ 30వ తేదీన జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ నుంచి తెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భయానక ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో పైలట్‌పై కత్తితో దాడి జరిగింది. విమానం అకస్మాత్తుగా కిందికి పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 

సుమారు 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఫ్లైట్ నంబర్ FDB1073లో జరిగింది ఈ భయంకరమైన ఘటన.  ప్రయాణీకుల్లో  పలువురు ఇజ్రాయెల్ పౌరులు కూడా ఉన్నారు. జోర్డాన్-సౌదీ అరేబియా సరిహద్దు పైన విమానం ప్రయాణిస్తుండగా ఫ్లైట్ నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్స్ వెలువడ్డాయి.  మొదట అంతర్జాతీయ అత్యవసర కోడ్ 7700, తర్వాత హైజాక్ సూచించే 7500 కోడ్ పంపించారు. దీంతో ఫ్లైట్ హైజాక్ అవుతుందని గమనించి యుద్ధ విమానాలతో ఛేజింగ్ మొదలైంది. 

ప్రయాణికులు చెప్పిన భయంకర నిజాలు:

ఫ్లైట్ లో భయంకరమైన ఇన్సిడెంట్ చూసినట్లు ఇజ్రాయెల్ ప్రయాణికుడు చెప్పాడు. ఛానల్ 12 తో మాట్లాడుతూ, విమానంలో ఘోరంగా అరుపులు వినిపించాయి. తర్వాత కాక్‌పిట్ తెరిచారు. రక్తం కనిపించింది. ఎవరో పాకెట్ నైఫ్‌తో పైలట్‌ను పొడిచారు అని ఒకరు చెప్పారు.

►ALSO READ | గుజరాత్ తీరంలో పట్టుబడ్డ నలుగురు పాకిస్తానీలు..510 కేజీల డ్రగ్స్ సీజ్

నోమ్ అనే మరో ప్రయాణికురాలు  మాట్లాడుతూ..  ఒక పైలట్‌పై దాడి జరిగటంతో తీవ్రంగా గాయపడ్డారని, విమానం కంట్రోల్ తప్పి వేగంగా కిందికి పడిపోతోందని అర్థమైంది. దాదాపు చనిపోయామని ఫిక్సయ్యామని కన్నీరు పెట్టుకుంది.  అయితే ఈ ఘటనలో కొందరు ఇజ్రాయెల్ ప్రయాణికులు సిబ్బందికి సహాయం చేసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వేల అడుగులు పడిపోయిన విమానం :

ఫ్లైట్ డేటా ప్రకారం  సుమారు 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం .. ఒక్క నిమిషంలోనే  17,000 అడుగులకు పడిపోయింది. వేగం కూడా పెరిగింది. తర్వాత కొంత ఎత్తుకు చేరి మళ్లీ 14,000 అడుగుల కిందికి వచ్చింది. దాదాపు గంటపాటు ఫ్లైట్ పైకి కిందికి ఎగురుతుండటంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సీట్లకు అతుక్కుపోయారు.  చివరకు  తబూక్‌లో సురక్షితంగా దిగింది.

కాక్‌పిట్‌లో ఏం జరిగింది?  

ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరగింది. విమానం నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్స్  పంపించారు.  ఒక పైలట్ విమానాన్ని కూల్చేయాలని ప్రయత్నించాడని, మరొక పైలట్, ప్రయాణికుల సహాయంతో ఆపారని తెలుస్తోంది. 

కాక్ పిట్ లో జరిగిన గొడవ కారణంగా.. విమానం హైజాక్ అవుతుందని గమనించి ప్రయాణికులు ఆందోళన చెందారు.  విమానంలో ప్రయాణికులుగా ఉన్న మరో ఇద్దరు పైలట్లు సహాయం చేశారని ఛానల్ 12 పేర్కొంది.  ఒక సీనియర్ ఇజ్రాయెల్ అధికారి మాట్లాడుతూ.. మరో సెప్టెంబర్ 11 లాంటి విపత్తు తప్పిందని అన్నారు. ఒమన్ పౌరుడైన ఒక పైలట్ ఈ దాడికి దిగినట్లు తెలిపారు. హైజాక్ కు కుట్రకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది.