భోపాల్‌‌ లో రిటైర్డ్ IAS దారుణ హత్య

భోపాల్‌‌ లో రిటైర్డ్ IAS దారుణ హత్య
  •     కొత్తగా చేరిన పనిమనిషిపై అనుమానం

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌‌లో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల కిందట పనిలో చేరిన కొత్త పనిమనిషే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూరజ్ నగర్ ప్రాంతంలోని తన బంగ్లాలో నివసించే 70 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ బుధవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భార్యతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. 

ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి, బెడ్‌‌పై రాకేశ్ అగర్వాల్ గొంతు కోసి ఉన్న మృతదేహం కనిపించింది.ఘటన జరిగినప్పటి నుంచి ఆ పనిమనిషి కనిపించకుండా పోవడంతో అతడే ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.