ఈసీ అక్రమాలపై ఐక్య పోరాటం.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నుంచి సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇండియా కూటమి పిలుపు

ఈసీ అక్రమాలపై ఐక్య పోరాటం.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నుంచి సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇండియా కూటమి పిలుపు
  • సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ’ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. ఇండియా కూటమి పిలుపు
  • అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు
  • ఈ నెల 6న ఈసీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల మార్చ్
  • బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్లతోనే పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ‘సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ముందు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలి
  • ఓటు నమోదును సరళతరం చేయాలని కూటమి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఈసీ నిష్పక్షపాతంగా ఉండాలంటూ ఆరు డిమాండ్లు
  • ఈసీని మోదీ, అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా కీలుబొమ్మగా మార్చారన్న ఖర్గే

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌‌‌‌‌) వివాదం, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సిద్ధమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిరంకుశ విధానాలను తిప్పికొట్టే లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజులపాటు దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ (సేవ్ డెమోక్రసీ మార్చ్) నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 

బుధవారం ఢిల్లీలోని కాన్‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌‌‌లో ‘ఇండియా’ కూటమి అగ్రనేతలు సమావేశమై.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లను పక్కనపెట్టి, బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కూటమి పట్టుబట్టింది.  దేశంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం పునరుద్ధరించాలంటే బ్యాలెట్ ఓటింగ్‌‌‌‌ విధానమే మార్గమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

జిల్లా కేంద్రాల్లో భారీ ఆందోళనలు 

అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట కూటమి భాగస్వామ్య పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనలో భాగంగా అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నట్టు ఖర్గే వెల్లడించారు. అక్టోబర్‌‌‌‌ రెండో వారంలో రాష్ట్రపతిని కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలను, ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు ఏ రకంగా స్వాధీనం చేసుకుంటున్నారో వివరించనున్నట్టు తెలిపారు.

బీజేపీ ఈవీఎంలను వాడుకుంటున్నది

తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా బీజేపీ ఈవీఎంలను వాడుకుంటోందని ఖర్గే ఆరోపించారు. మహదేవ్‌‌‌‌‌‌‌‌పుర, ఆలంద్, హర్యానా, మహారాష్ట్రల్లో ఓటర్ల జాబితాల తారుమారుపై ప్రతిపక్షాలు ఆధారాలు చూపించినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కేంద్రం పూర్తిగా కాలరాసిందని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ‘‘ఎన్నికల సంఘంలోని కొందరు ఉన్నతాధికారులు కేవలం పావులుగా మారారు. 

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వారిని కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారు’’ అని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని, ఈ అన్యాయంపై రాజీలేని ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయనను బాధ్యతల నుంచి తొలగించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తొలగిస్తూ కేంద్రం తెచ్చిన 2023 ఈసీ నియామక చట్టాన్ని ప్రస్తావిస్తూ.. కమిషన్‌‌‌‌ను రబ్బర్ స్టాంప్‌‌‌‌లా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఖర్గే విమర్శించారు. 

కూటమి డిమాండ్లు ఇవే..

  • రాబోయే ఎన్నికల్లో ‘సర్‌‌‌‌‌‌‌‌’ కంటే మునుపటి ఓటర్ల జాబితాలనే ప్రాతిపదికగా తీసుకోవాలి. జాబితా సవరణల్లో చోటుచేసుకున్న పేర్ల చేర్పులు, తొలగింపుల వివరాలను నియోజకవర్గాలవారీగా, పోలింగ్ బూత్‌‌‌‌లవారీగా పూర్తి పారదర్శకతతో వెల్లడించాలి.
  • ఓటరు జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును తొలగించాలన్నా ముందుగా తగిన నోటీసు, సరైన కారణాలు తెలపాలి. ఆ నిర్ణయంపై అప్పీల్ చేసుకునే స్పష్టమైన యంత్రాంగం ఉండాలి.
  • అధికార యంత్రాంగం వైఫల్యాలు, పత్రాల కొరత లేదా అవగాహనరాహిత్యం కారణంగా అర్హులైన నిజమైన ఓటర్లెవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా గట్టి రక్షణ కల్పించాలి.
  • ఈవీఎంలను పూర్తిగా నిలిపివేసి, పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి.
  • తొలిసారి ఓటు హక్కు పొందే యువతకు దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా ఉండాలి. ఫామ్-6 నిబంధనల్లో మార్పులతో యువతను ఓటింగ్‌‌‌‌కు దూరం చేసే ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
  • అన్ని రాజకీయ పక్షాలు, దేశ ప్రజలు విశ్వసించేలా భారత ఎన్నికల సంఘం 
  • నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనంతో వ్యవహరించాలి.