నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం యాక్షన్‌‌‌‌‌‌‌‌, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ తో వేల్‌‌‌‌‌‌‌‌

నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం యాక్షన్‌‌‌‌‌‌‌‌,  సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ తో వేల్‌‌‌‌‌‌‌‌

రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరో హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నాగేంద్ర ఆవుల తెరకెక్కించిన చిత్రం ‘వేల్‌‌‌‌‌‌‌‌’. క్షత్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై జి. అశోక్, వై మురళి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. నటుడు నాగమహేష్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.  ‘మనిషి తన స్వార్థం కోసం ఎ న్ని ముసుగులు వేసుకుంటున్నాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. 

తర్వాత ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ రేపుతుంది’ అని హీరోలు ఆదిత్య, రవిచంద్ర చెప్పారు.  మిస్ ఇండియా విన్నర్ అయిన తాను ఈ చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించడం సంతోషంగా ఉందని అమృత శ్రీవాత్సవ చెప్పింది.  ప్రొడ్యూసర్ జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ‘చక్కని సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ కలగలిసిన చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌కు నచ్చుతుంది.  వచ్చే నెలలో రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.  ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చే సినిమా అవుతుంది’ అని దర్శకుడు నాగేంద్ర చెప్పాడు.