హైదరాబాద్లో డోర్డాష్ గ్లోబల్ టెక్ హబ్.. 3 వేల కొత్త ఉద్యోగాలు

హైదరాబాద్లో డోర్డాష్ గ్లోబల్ టెక్ హబ్.. 3 వేల కొత్త ఉద్యోగాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : అమెరికాకు చెందిన  ఫుడ్ డెలివరీ సంస్థ డోర్‌‌‌‌డాష్,   హైదరాబాద్‌‌‌‌లో  గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌‌‌ను  ప్రారంభించింది. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా రానున్న రెండేళ్లలో మూడు వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా.  తొలివిడతలో ఇక్కడ పనిచేసేవారు  కస్టమర్ సపోర్ట్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్  పనులను చూసుకుంటారు. ఇందులో భాగంగా  500 మంది నిపుణులను తీసుకుంటామని డోర్‌‌‌‌‌‌‌‌డాష్‌‌‌‌ ప్రకటించింది.  

పుణె తర్వాత భారత్‌‌‌‌లో కంపెనీకి ఇది రెండో ఆఫీస్. గ్లోబల్‌‌‌‌గా టెంపే (అరిజోనా), మెక్సికో సిటీ తర్వాత మూడో ప్రధాన సర్వీస్ హబ్‌‌‌‌గా హైదరాబాద్ నిలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు జీసీసీలను ఎంఎన్‌‌సీలు  ఏర్పాటు చేస్తున్నాయి. కాస్ట్‌‌‌‌కో, మెక్‌‌‌‌డొనాల్డ్స్, చార్లెస్ స్క్వాబ్, మారియట్ వంటి ఎంఎన్‌‌సీలు హైదరాబాద్‌‌‌‌లో తమ సెంటర్లను తెరిచాయి.  ఇండియాలో  2,100కు పైగా జీసీసీలు ఉండగా, ఇందులో 23.6 లక్షల మంది పనిచేస్తున్నారు.