స్టూడెంట్లు ఉన్నత లక్ష్యంతో చదవాలి..జ్యోతిబాపూలే గురుకులాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

స్టూడెంట్లు ఉన్నత లక్ష్యంతో చదవాలి..జ్యోతిబాపూలే గురుకులాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

తిమ్మాపూర్, వెలుగు : స్టూడెంట్లు ఉన్నత లక్ష్యంతో చదివి, తమ లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా స్టూడెంట్లతో మాట్లాడి విద్యా ప్రమాణాలు, బోధన విధానం, ఉపాధ్యాయుల పనితీరు, హాస్టల్ వసతులు, భోజనం, తాగునీరు, ఆరోగ్యం, క్రీడలు, పాఠ్యేతర కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా పురోగతి, బోధనలో ఎదురవుతున్న సవాళ్లు, పాఠశాల అభివృద్ధికి అవసరమైన పనుల గురించి టీచర్లను అడిగారు. 

విద్యార్థుల అవసరాలు, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ 
సరిత పాల్గొన్నారు.