రాజ్ కుమార్ రావు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’. వామికా గబ్బి హీరోయిన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో దర్శకుడు అవినాష్ అరుణ్ ధవారే ఈ సినిమాను రూపొందించారు. 26/11 ముంబై దాడి కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవిత కథ ఇది.
ఆ కేసు విషయంలో కోర్టులో జరిగిన వాదోపవాదాలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను ఇందులో చూపించారు. ఉజ్వల్ నికమ్ పాత్రలో రాజ్ కుమార్ రావు ఆకట్టుకోగా, ఆయన భార్యగా వామికా గబ్బి కనిపించింది. జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్, నాజర్, అశిష్ విద్యార్థి, లలిత్ ప్రభాకర్, రిత్విక్ సాహోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 16న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది.
