న్యూఢిల్లీ: ఇండియాలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలయన్స్ జియో లిమిటెడ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,500 కే జియోభారత్ 4జీ ఫోన్‌తో పాటు 6 నెలల ఉచిత రీఛార్జ్ (నెలకు 14జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్) అందిస్తోంది. 6 నెలల రీఛార్జ్ విలువే రూ.1,200 కావడంతో, ఫోన్ ధర కేవలం రూ.299 పడుతుందని జియో తెలిపింది.
ఇందులో జియోటీవీ, జియోహాట్‌స్టార్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2జీ నుంచి 4జీకి మారే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ యానివర్సరీ ఆఫర్ తెచ్చింది.
