సింహ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహాల వలన సవాళ్లు పెరుగుతాయి. నెల చివరిలో గురుడు స్థానం మారడంతో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అక్టోబర్లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు
- అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
- అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్) శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
అక్టోబరు నెలలో ఈ రాశి వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీపై అధికారుల నుండి ఒత్తిడి పెరిగినప్పటికీ మీ ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. అక్టోబరు 17న సూర్యుడు తులా రాశిలోకి మారిన తర్వాత ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చూస్తారు.
ఈ నెలలో ఈ రాశి వారు మొండి తనం వదిలి సామరస్యం ప్రవర్తించండి. నెల చివరి వారంలో అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. 12వ ఇంట్లో గురుడు, కుజుడు సంచారం వలన అవసరమైనంత విశ్రాంతి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 8వ ఇంట్లో శని వక్రీకరించడం వలన ఈ రాశి వారికి సాయంత్రానికల్లా మీ శరీరం నీరసించడం మొదలవుతుంది. ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ చూస్తూ గడపడానికి బదులుగా.. పడుకునే ముందు ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కాళ్లు, కళ్ల ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి. ఆహారం విషయంలో కచ్చితంగా టైం పాటించండి.
7వ ఇంట్లో రాహువు సంచారం వలన ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు. శుక్రుని తిరోగమనం వలన పాత విషయాల గురించి ఆలోచిస్తుంటారు. బుధుని తిరోగమనంతో సింహరాశి వారికి ప్రమాదకన పరిస్థితులు ఉంటాయి.
వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లేదా భాగస్వామ్యాలు లభించే అవకాశం ఉంది. ఈ నెలలో మీ రాబడి స్థిరంగా ఉన్నప్పటికీ, వరుస పండుగలు, శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనుకోని ప్రయాణాలు లేదా కుటుంబ అవసరాల కోసం ధనం ఖర్చు కావచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు అందుకుంటారు.
ALSO READ :" జ్యోతిష్యం : అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి జాతకం..
పాత అప్పులు తీర్చేందుకు ఈ నెల కొంతవరకు అనుకూలిస్తుంది. కొత్తగా పెద్దమొత్తంలో రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య పరంగా కంటి ఒత్తిడి, మానసిక అలసట లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చేయాల్సిన పరిహారాలు
- ప్రతి రోజు ఉదయం..సాయంత్రం రాగి పాత్రలో సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి
- ప్రతి రోజు ఉదయం సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ "ఓం ఘృణి సూర్యాయ నమః" అనే మంత్రాన్ని108 సార్లు చదవండి
- ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్లండి.
- పేదవారికి బెల్లం, గోధుమలు దానం
- ఇంటి పైకప్పు మీద పక్షుల కోసం ధాన్యం, నీరు ఉంచండి.
- శ్రీ హరి విష్ణువును లేదా సూర్య నారాయణుడిని పూజించండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
