జ్యోతిష్యం : అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి జాతకం..లాభ స్థానంలో శుక్రుడు.. అదృష్టం తన్నుకొస్తుంది..

జ్యోతిష్యం  : అక్టోబర్  నెల కర్కాటక రాశి వారి జాతకం..లాభ స్థానంలో శుక్రుడు.. అదృష్టం తన్నుకొస్తుంది..

కర్కాటకరాశి వారికి 2026 అక్టోబర్​ లో గ్రహాల మార్పు వలన సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లాభ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ఈ రాశి వారికి  అదృష్టం  ఇంటి తలుపు తడుతుంది. ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది.  2026 అక్టోబర్​ నెలలోఈ  రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందాం. . .! 

అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి.  ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

అక్టోబర్​లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు

  • అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
  •  అక్టోబర్ 17:   తులారాశిలోకి  సూర్యుడు 
  • అక్టోబర్ 24: తులారాశిలో   బుధుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్)​ శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ నెల కర్కాటక రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది.  
 కీలక గ్రహాలు కలయిక వలన ఏర్పడే యోగాల  వలన మానసిక సమస్యలు కలిగే అవకాశం ఉంది. అయితే గురుడి శుభ దృష్టి వలన అనుకోకుండా వచ్చిన ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది.

అక్టోబర్‌లో గురు గ్రహం కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ విజయానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశి వారు పండుగల కాలాన్ని  ఎంతో ఆనందంగా గడుపుతారు.గతంలో పడిన ఇబ్బందులు  చాలా వరకు పరిష్కారమవుతాయి.  ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పాత బకాయిలు వసూలు.. మీరు ఇచ్చిన అప్పులు వసూలయ్యే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి వారికి 2026  అక్టోబర్​ నెలో కుజుడు, గురుడు 1వ ఇంట్లో సంచరించనున్నారు. శని భగవానుడు 9 వ ఇంట్లో వక్రగతిలో.. రాహువు 8 వ ఇంట్లో.. కేతువు 2వ ఇంట్లో సంచరిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ గ్రహాల సంచారం వలన ప్రతి పనిలో కూడా అలసిపోతారు.. చిరాకు.. తొందరపాటు తనం కలిగి ఉంటారు.  వాహనం డ్రైవింగ్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మితిమీరిన ఆలోచనల కారణంగా మానసిక అలసట ఏర్పడే అవకాశం ఉంది. 

 శుక్రుని తిరోగమనం వలన  భావోద్వేగ అంచనాలను అదుపు చేసుకోవాలి.  బుధుని తిరోగమనం కుటుంబ సభ్యుల విషయంలో అపార్ధాలు వచ్చేఅవకాశం ఉంది.  కుజుడు శక్తిని అందిస్తాడు, గురుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఆర్థిక విషయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

ఈ రాశి వారు 2026 అక్టోబర్​ నెలలో   దైవశక్తి అనుకూలించడంతో  మానసికంగా దృఢంగా ఉంటారు.   మానసిక ఆరోగ్యం, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.. చేతి వృత్తి వారికి.. ఉద్యోగస్తులకు  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ప్రమోషన్​ కోసం ఎదరు చూసే వారు.. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. బిజినెస్​ చేసే వారు కొత్త ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా అనుకూల సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

ALSO READ :  మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు..

కర్కాటక రాశి వారికి 2026 అక్టోబర్​ నెలలో ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పాత బకాయిలు వసూలు కావడంతో కొత్తగా ఆస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. దూరప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు, దంపతుల మధ్య అనుబంధం మధురంగా సాగుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

చేయాల్సిన పరిహారాలు

  • ప్రతి సోమవారం, శివునికి పచ్చి పాలు, నీటితో అభిషేకం 
  • శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారిని పూజించండి.
  • చంద్రుడి ఆశీస్సుల కోసం "ఓం చంద్రాయ నమః"  అనే మంత్రాన్ని ప్రతి రోజు ప్రదోష కాలంలో అంటే  సాయంత్రం చంద్రోదయ వేళ 108 సార్లు  పఠించండి.
  •  అలసిపోకముందే పని చేయడం ఆపి, విశ్రాంతి తీసుకోండి
  • సోమవారం  బియ్యం, పెరుగు , పంచదార మిఠాయి దానం
  • ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయండి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.