జ్యోతిష్యం : మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు..ఎట్టి పరిస్థితిలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.. చేయాల్సిన పరిహాలు ఇవే..!

జ్యోతిష్యం :  మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు..ఎట్టి పరిస్థితిలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.. చేయాల్సిన పరిహాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 అక్టోబర్​ నెలలో కీలక గ్రహాలు స్థానాలు మారబోతున్నాయి.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఈ నెలలో మిథునరాశి వారి జీవితంలో  మిశ్రమ ఫలితాలతో  అనేక  పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ నెలలో ( అక్టోబర్​ 2026) మిథునరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!

అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి.  ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

అక్టోబర్​లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు

  • అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
  •  అక్టోబర్ 17:   తులారాశిలోకి  సూర్యుడు 
  • అక్టోబర్ 24: తులారాశిలో   బుధుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్)​ శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

గ్రహాల సంచారం కారణంగా  మిథున రాశి వారికి 2026 అక్టోబరు నెల మిశ్రమ ఫలితాలుంటాయి. నెల మొదటి భాగం కాస్త నిలకడగా సాగినా, ద్వితీయార్థంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.  ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో సంభాషించేటప్పుడు ఓర్పు.. సహనం పాటించడం చాలా అవసరం.అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. 

ఆర్థికంగా రాబడి సాధారణంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.  అప్పులు ఇవ్వడం కాని తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. పాత అప్పులు తీర్చేందుకు ఈ నెల కొంతవరకు అనుకూలిస్తుంది.  దసరా పండుగ సమయం కావడంతో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య పరంగా కంటి ఒత్తిడి, మానసిక అలసట లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


మిథున రాశివారికి  అక్టోబర్​ నెలలో 4వ ఇంట్లో  సూర్యుడి సంచారం వలన మీ మనసు భారంగా అనిపించవచ్చు. 2 వ  ఇంట్లో ఉన్న కుజుడు మీ ఆహారపు అలవాట్ల విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.  ఆఫీసులో మధ్యాహ్న భోజనం మానేయడం, రాత్రిపూట మసాలా ఆహారం తినడం వల్ల గుండెల్లో మంట కలిగే అవకాశం ఉంది.  నోరు, గొంతు విషయంలో కూడా జాగ్రత్త వహించండి. 10వ  ఇంట్లో  శని వక్రించడం వలన పనిభారం పెరుగుతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. 

ALSO READ : అక్టోబర్ నెల వృషభ రాశి.. ఆగిపోయున పనులు వేగవంతం..

చేయాల్సిన పరిహారాలు:

  • మంగళవారాల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం
  •  సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం శుభఫలితాలు 
  • బుధుడిని శాంతి పరిచేందుకు ప్రతిరోజు 108 సార్లు "ఓం బుధాయ నమః" మంత్రాన్ని జపించండి.
  • రాగి పాత్రలో నీటిని నింపి సూర్యభగవానుడి నీళ్లను సమర్పించాలి. 
  • ఉదయం రాగి పాత్రలో నీటిని నింపి సూర్య భగవానునికి సమర్పించండి.
  • ప్రతి బుధవారం పెసరపప్పు ,  ఆకుకూరలు దానం చేయండి
  • ఉదయం, సాయంత్రం 21  నిమిషాల పాటు యోగా  చేయండి.
  •  పక్షులకు  ఆహారం, నీరు  ఇవ్వండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.