భారతీయ రిజర్వ్ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. అక్టోబరు నెలలో వివిధ పండుగలు, జాతీయ ప్రాంతీయ దినోత్సవాలు, అలాగే రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఈ సెలవులన్నీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఒకే రీతిలో వర్తించవు. ప్రాంతాన్ని బట్టి సెలవు దినాలు మారుతుంటాయి.
అక్టోబరు నెలలో బ్యాంక్ సెలవులు:
* అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో (హైదరాబాద్‌తో సహా) బ్యాంకులకు సెలవు.
* అక్టోబర్ 4: ఆదివారం (వారం సెలవు).
* అక్టోబర్ 10: మహాలయ అమావాస్య సందర్భంగా బెంగళూరు, కోల్‌కతాలో బ్యాంకులు బంద్.
* అక్టోబర్ 11: రెండవ శనివారం.
* అక్టోబర్ 17: మహా సప్తమి సందర్భంగా అగర్తలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
* అక్టోబర్ 19: దుర్గాపూజ, దసరా సందర్భంగా అగర్తల, చెన్నై, కోల్‌కతా, పాట్నా, రాంచీ సహా పలు ప్రాంతాల్లో సెలవు.
* అక్టోబర్ 20: విజయ దశమి సందర్భంగా గ్యాంగ్‌టక్, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్.
* అక్టోబర్ 21 & 22 & 23: విజయదశమి, దుర్గాపూజ పండుగలను పురస్కరించుకుని బెంగళూరు, కోల్‌కతా, కొచ్చి, త్రివేండ్రం, గ్యాంగ్‌టక్‌లో వివిధ తేదీల్లో సెలవులు ఉన్నాయి.
* అక్టోబర్ 24: నాల్గవ శనివారం.
* అక్టోబర్ 25: ఆదివారం (వారం సెలవు).
* అక్టోబర్ 26: లక్ష్మీ పూజ, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అగర్తల, జమ్ము, చండీగఢ్, శ్రీనగర్, సిమ్లాలో బ్యాంకులు పనిచేయవు.
* అక్టోబర్ 29: కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంక్ సెలవు.
* అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులకు సెలవు.
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ, ఏటీఎం లాంటి డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఫండ్ ట్రాన్స్‌ఫర్లు, బిల్లుల చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే క్లియరింగ్ హౌస్‌కు సంబంధించిన కొన్ని సేవల్లో మాత్రం జాప్యం జరగవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్‌లు, లాకర్ యాక్సెస్, కేవైసీ అప్‌డేట్లు లేదా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు వంటి పనులు ఉన్నవారు సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పూర్తి చేసుకోవడం మంచిది.
