సైబర్ స్కాం కాదు అంతకు మించి.. రూ. రెండు కోట్ల ఇల్లు, నగలు, దోచుకున్నారు..! వృద్ధురాలి జీవితకాలం సంపాదన

సైబర్ స్కాం కాదు అంతకు మించి.. రూ. రెండు కోట్ల ఇల్లు, నగలు, దోచుకున్నారు..! వృద్ధురాలి జీవితకాలం సంపాదన

ఢిల్లీలో సైబర్ స్కాంను మించిన స్కాం వెలుగులోకి వచ్చింది. 75 ఏళ్ళ వృద్ధురాలికి చెందిన రూ.2 కోట్ల ఇల్లు, డబ్బులు, బంగారం  దోచుకున్నారు. ఈ స్కాంలో ఆమె జీవితకాలపు సంపాదన మొత్తం పోగొట్టుకుంది. ఈడీ అధికారులమని చెప్పి బాధితురాలికి కాల్ చేసిన స్కామర్లు.. మనీ లాండరింగ్ కేసులో సంబంధం ఉందని చెప్పి.. ఏకంగా ఆమె ఇంటికి వచ్చి ప్లాన్ అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితురాలి ల్యాండ్ లైన్ కు 2026 ఏప్రిల్ 6న గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా నటిస్తూ ఫోన్ చేసిన స్కామర్లు, ఆమె నంబర్ ఒక మనీలాండరింగ్ కేసులో ఉపయోగించిన మరో నంబర్‌తో లింక్ అయ్యిందని చెప్పారు. దీంతో భయాందోళనకు గురైంది బాధితురాలు.

ఆ తర్వాత నిందితులు తనకు వాట్సాప్ వీడియో కాల్ చేశారని... పోలీస్ యూనిఫామ్ లో నిజమైన పోలీసులమని నమ్మించారని తెలిపింది బాధితురాలు. అంతేకాకుండా, తనను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక మొబైల్ నంబర్‌ను కూడా ఉపయోగించినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని.. ఆ తర్వాత తన అకౌంట్ నుంచి వేరొక ఆకౌంట్ కి రూ. లక్షలు బదిలీ చేయించుకున్నారని తెలిపింది బాధితురాలు.

ముత్తూట్ ఫినాన్స్ లో 83.5 గ్రాముల బంగారం పెట్టి సుమారు రూ. 5 లక్షలు లోన్ తీసుకొని మోసగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపింది బాధితురాలు. ఆ తర్వాత ఇల్లు అమ్మకానికి సంబంధించి ప్రాపర్టీ డీలర్ ఆమెను సంప్రదిస్తారని చెప్పారు. ఇల్లు అమ్మకానికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేస్తారని, సూచించిన విధంగా ఆమె ఆ పత్రాలను అందించాలని స్కామర్లు చెప్పినట్లు తెలిపింది బాధితురాలు.

స్కామర్లు చెప్పినట్లుగానే ప్రాపర్టీ డీలర్ అంటూ ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి ఇంటికి సంబంధించిన పాత్రలన్నీ తీసుకున్నాడని.. కొన్నాళ్ల తర్వాత కొనుగోలుదారులాంటి మరో ఇద్దరినీ ఇంటికి తీసుకొచ్చాడని తెలిపింది బాధితురాలు. వారితో కలిసి ఇల్లు అమ్మకానికి సంబంధించి అడ్వాన్స్ రిసీట్ పై తనతో సంతకం చేయించుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా.. తనకు డీటెయిల్స్ ఏమీ చెప్పకుండా చాలా పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నారని తెలిపింది బాధితురాలు.

►ALSO READ | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు: ఆ లవర్స్ ఇద్దరూ దోషులే.. శిక్షపై అందరిలో ఆసక్తి

ఆ తర్వాత తన అకౌంట్లో రెండు చెక్కులు ఒకటి రూ. 23 లక్షలకు, మరొకటి రూ. 10 లక్షలకు సంబంధించినవి. జమ అయ్యాయని...  ఆ తర్వాత అదే రోజు రూ. 21 లక్షలు విత్ డ్రా చేయబడ్డాయని... మరుసటి రోజు మరో రూ. 3 లక్షలు విత్ డ్రా చేయబడ్డాయని తెలిపింది బాధితురాలు. ఆ మొత్తాన్ని సావిత్రి బాయి ఫూలే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అనే ఖాతాకు బదిలీ చేశారని తెలిపింది బాధితురాలు. ఆ తర్వాత మోసగాళ్ల నుంచి ఎలాంటి కాల్స్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించానని తెలిపింది బాధితురాలు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కంబోడియా నుండి పనిచేస్తున్న ఒక ముఠా ఈ స్కాం వెనుక ఉందని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు పోలీసులు.