వర్షం దెబ్బకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్ రద్దు.. సెమీస్ బెర్త్ ఫిక్స్: పాక్తో కాదు శ్రీలంకతోనే భారత్ ఢీ

వర్షం దెబ్బకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్ రద్దు.. సెమీస్ బెర్త్ ఫిక్స్: పాక్తో కాదు శ్రీలంకతోనే భారత్ ఢీ

India vs Sri Lanka Semifinal: 2026 ఆసియా క్రీడలలో (Asian Games 2026) పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌ను వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ రద్దు కావడంతో, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం సెమీఫైనల్స్ బెర్త్‌లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు శ్రీలంకతో తలపడనుంది.

వర్షం దెబ్బకు అన్నీ క్వార్టర్ ఫైనల్స్ రద్దు: 

నాగోయా, నిస్షిన్ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెన్స్ క్రికెట్ నాకౌట్ దశ మ్యాచ్‌లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాకిస్థాన్ - హాంకాంగ్, భారత్ ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన తొలి రెండు క్వార్టర్ ఫైనల్స్ వర్షంతో పూర్తిగా రద్దయ్యాయి. ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న కారణంగా భారత్, పాకిస్థాన్‌లు నేరుగా సెమీస్‌లోకి ప్రవేశించాయి. అలాగే శ్రీలంక వర్సెస్ నేపాల్, బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా మ్యాచ్‌లు కూడా వర్షార్పణం కావడంతో, ర్యాంకింగ్ ఆధారంగా శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.

శ్రేయస్ కెప్టెన్సీలో బరిలోకి భారత్: 

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంకా ఈ ఆసియా క్రీడల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ గైర్హాజరీలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ టోర్నీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

►ALSO READ | టీ20ల్లో శ్రీ చరణి సరికొత్త రికార్డు.. మళ్లీ టాప్-5లోకి స్మృతి మందాన!

అక్టోబర్ 1న సెమీఫైనల్స్: 

వర్షం అంతరాయం తొలగిపోయి, వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ 1వ తేదీ (గురువారం)న రెండు హై-వోల్టేజ్ సెమీఫైనల్స్ జరగనున్నాయి. 

* మొదటి సెమీఫైనల్: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్

* రెండో సెమీఫైనల్: భారత్ vs శ్రీలంక (వేదిక: కొరోగీ స్పోర్ట్స్ పార్క్, నిస్షిన్)