టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' మేనియా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ఓ రేంజ్ లో ఊపేస్తోంది. హాట్ టచింగ్ తండ్రి కూతురు సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రవితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో రికార్డుల వేట మొదలుపెట్టింది.
సెప్టెంబర్ 18న డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన 'ఇరుముడి' చిత్రం.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 (Non-English Movies) చార్ట్స్‌లో దూసుకెళ్తోంది . ఏకంగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి ఎగబాకి సరికొత్త చరిత్ర సృష్టించింది. గత వారం మూడో స్థానంలో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య 'విశ్వనాథ్ & సన్స్' చిత్రాన్ని వెనక్కి నెట్టి గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది.
ఓటీటీలోకి వచ్చిన తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 3.4 మిలియన్ల వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక సెప్టెంబర్ 21-27 వారంలో మరో 3.4 మిలియన్ల వ్యూస్ సాధించి.. ఓవరాల్‌గా 6.8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోనూ రచ్చ చేస్తోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సినీ ప్రియుల నుంచి విశేషమైన స్పందన రావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.
Proud moment for @DoneChannel1 ! 🎬🔥
— Done Channel (@DoneChannel1) September 30, 2026
Honoured to be associated with three films featured in Netflix India’s Top 10 — Irumudi, Modha Rathiri & G.D.N. 🏆
Grateful to be part of these incredible journeys and collaborations. @SureshChandraa @NetflixIndia @Netflix_INSouth… pic.twitter.com/NEW1kMNz8R
ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ టేకింగ్, రవితేజ నటనలోని ఎమోషనల్ యాంగిల్, పాపా నక్షత్ర క్యూట్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా అలరించగా, విలక్షణ నటుడు సాయికుమార్ కీలక పాత్రలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్ రైడ్‌కు ప్రధాన బలంగా నిలిచింది.
►ALSO READ | 'హనుమాన్ అంశ్ 2' లో అక్షయ్ కుమార్? క్లారిటీ ఇచ్చిన నిర్మాత అనుప్రియా నాగర్!
ప్రస్తుతం ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రాంతీయ సరిహద్దులు దాటి గ్లోబల్ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటున్న రవితేజ 'ఇరుముడి' రానున్న రోజుల్లో ఇంకెన్ని అంతర్జాతీయ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి
