కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) చిత్రం బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తోంది. ఈ మూవీ విడుదలై 55 రోజులు అవుతున్నా.. ఏ మాత్రం జోరు తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా దివ్య జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక , సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.
బోల్డ్ ఐడియాతో బాక్సాఫీస్ వద్ద అడుగుపెట్టి.. ఏకంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది 'హనుమాన్ అంశ' (Hanuman Ansh). పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ వేప చెట్టు బాబాగా సుపరిచితులైన ‘నీమ్ కరోలీ బాబా’ (Neem Karoli Baba) దివ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సినిమాటిక్ అనుభూతిని అందించింది.
పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి .. బాక్సాపీస్ వద్ద అద్భుతాలు సృష్టించడంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 2 పై ప్రకటన చేసి అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ ప్రయాణంలో రెండో భాగం 'హనుమాన్ అంశ్2' రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించిన వర్క్ కూడా రెడీ అయింది.
అయితే, ఈ పార్ట్-2 గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ సీక్వెల్‌లో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటించబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ రూమర్లపై నిర్మాత అనుప్రియా నాగర్ (Anupriya Nagar) తక్షణమే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ కుమార్ కాస్టింగ్ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం కల్పిత వార్తలని తెల్చిచెప్పారు.
ALSO READ : విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో 'ది ప్యారడైజ్' టీమ్..
మరోవైపు, పార్ట్-2ను మునుపటి కంటే రెట్టింపు విజువల్ గ్రాండియర్‌తో తెరకెక్కించేందుకు దర్శకుడు విశాల్ చతుర్వేది (Vishal Chaturvedi) పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నీమ్ కరోలీ బాబా తొలి జీవిత ఘట్టాలైన అక్బర్‌పూర్, ఆగ్రా, మధుర ప్రాంతాలలో సాగిన అద్భుత ప్రయాణాన్ని ఇందులో చూపించబోతున్నారు. హీరోగా శోభినావ్ సత్యా (Shobhinaw Satyaa) మళ్లీ తన నటనతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ,లొకేషన్ సెర్చింగ్ చాలా వేగంగా జరుగుతున్నాయి.
మొదటి భాగంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ టీమ్, పార్ట్-2తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో, నీమ్ కరోలీ బాబా మహిమలను వెండితెరపై ఎంత వైభవంగా చూపిస్తుందో అని బాలీవుడ్ విశ్లేషకులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
