టాలీవుడ్ నేచురల్ స్టార నాని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇటీవల రిలీజైన 'ది ప్యారడైజ్' సక్సెస్ తో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ అంతా కలిసి విజయవాడ, గుంటూరులో పర్యటించింది.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. నానితో పాటు చిత్రబృందానికి వేదపండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం చిత్రబృందం విజయవాడ, గుంటూరు థియేటర్లలో ప్రేక్షకులతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తమపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నాని ని చూస్తేందుకు ఫ్యాన్స్, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Natural Star @NameisNani took the divine blessings at the Kanaka Durga Temple in Vijayawada ❤🔥
— THE PARADISE (@TheParadiseOffl) September 30, 2026
Book your tickets for #TheParadise now!
🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/0nLeH28Rka
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ కు సొంతం చేసుకున్నా.. వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ. 80 కోట్లకు కు పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసి నాని కెరీర్ లోనే బిగ్గేస్ట్ ఓపెనింగ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది.
ALSO READ : జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ వేటు..
ముఖ్యంగా ఈ చిత్రంలో శంకరన్కన పాత్రలో హీరో ప్రియదర్శి పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని ప్రతిభింబించేలా ఆయన సాలిడ్ పెర్ఫామెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంకా ఈమూవీలో కయూదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడా.. ఎస్ఎల్వీ సినిమాస్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏమేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.
A massive crowd welcomed Natural Star @NameisNani at Mythri Mall Theatre in Guntur ❤🔥#TheParadise In Cinemas Now
— THE PARADISE (@TheParadiseOffl) September 30, 2026
🎟️ Book your tickets: https://t.co/QWwS4Ichic pic.twitter.com/qA7v3JEVrP
