కేసీఆర్, కేటీఆర్ భజన తప్ప..ఎమ్మెల్యేగా జనం సమస్యలపై స్పందించవా? : మెట్టు సాయి కుమార్

కేసీఆర్, కేటీఆర్ భజన తప్ప..ఎమ్మెల్యేగా జనం సమస్యలపై స్పందించవా? : మెట్టు సాయి కుమార్
  •     తలసాని పై మెట్టు సాయి ఫైర్ 

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ భజన చేయడం తప్ప, ఎమ్మెల్యేగా జనం సమస్యలపై స్పందించేది లేదా..అని తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ పై పీసీసీ ఫిషరీస్ సెల్ రాష్ట్ర  చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

బీఆర్ఎస్ జపం చేస్తూ..సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న తలసాని తన పేరును శ్రీనివాస్ గా కాకుండా శ్రీనివాస్ రావుగా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బీసీల రాజకీయ అస్థిత్వాన్ని కేసీఆర్ మొకాళ్ల కింద పెట్టిన తలసాని రాష్ట్రంలోని బీసీ నేతల పరువు తీస్తున్నాడని విమర్శించారు. బీసీల ఆత్మాభిమానాన్ని దొరల కాళ్ల దగ్గర పెట్టే సంస్కృతికి తలసాని మానుకోవాలని మెట్టు సాయి కుమార్ సూచించారు.