మోడీ గిఫ్ట్స్ వేలంతో రూ. 1.89 కోట్లు.. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి

మోడీ గిఫ్ట్స్ వేలంతో రూ. 1.89 కోట్లు.. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు, స్మారక చిహ్నాలను ఈ- వేలం వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.89 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. సోమవారం లోక్‌‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన ఐదేళ్ల వివరాలతో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2025లో జరిగిన ఏడో విడత ఈ-వేలం ద్వారా రూ.1.89 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 

అంతకుముందు 2024లో జరిగిన ఆరో విడత ఈ-వేలం ద్వారా రూ.2.24 కోట్లు సమకూరాయన్నారు. ఆ విడతలో 600కు పైగా గిఫ్ట్స్​, స్మారక చిహ్నాలను వేలానికి పెట్టినట్లు చెప్పారు. వీటిలో దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, చరిత్ర, రాజకీయాలకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఉన్నాయన్నారు. ప్రధాని కానుకల ఈ–వేలం కార్యక్రమాన్ని 2019 జనవరిలో ప్రారంభించినట్లు తెలిపారు.