విజువల్ ట్రీట్ ఇచ్చేలా అగధ

విజువల్ ట్రీట్ ఇచ్చేలా అగధ

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనిత  విజయ్ కుమార్  ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’.  ఎంఎస్ రాజు  దర్శకత్వంలో  కాశీ విశాలాక్షి బలుసు  నిర్మించారు.  ఆగస్టు 14న సినిమా విడుదల  కానుంది.  సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. నిర్మాతలు శ్యాం ప్రసాద్ రెడ్డి, లగడపాటి శ్రీధర్,  దర్శకులు బి.గోపాల్, అనిల్ విశ్వనాథ్​,  సాయి రాజేష్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

ఎంఎస్ రాజు మాట్లాడుతూ ‘ఈ మూవీ టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  సినిమా కూడా   బ్లాక్ బస్టర్ అవుతుందని నా మనసు చెబుతోంది’ అని అన్నారు.   కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ‘ఈ  జర్నీలో ఎంతో  నేర్చుకున్నా.  నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పునాది వేసింది  ఎప్పటికీ రాజుగారే అని చెబుతాను. మేమెంతో ఇష్టపడి సినిమా చేశాం.  

అదే ప్రేమను ఆడియెన్స్ తిరిగి ఇస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పింది. విజువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్ ఇచ్చేలా ఈ  చిత్రం ఉంటుందని శ్రవణ్ రెడ్డి అన్నాడు. ఈ సినిమా విజయంపై ఎంతో కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నామని  నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు అన్నారు. నటులు భానుచందర్,  గగన్, వనితా విజయ్ కుమార్ , జోవికా విజయ్ కుమార్,  షిజు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.