గూగుల్ డ్రైవ్ ఫోటో బ్యాకప్ సర్వీసులు బంద్.. ఇప్పుడు ఏం చేయాలి..?

గూగుల్ డ్రైవ్ ఫోటో బ్యాకప్ సర్వీసులు బంద్.. ఇప్పుడు ఏం చేయాలి..?

ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్ గా డ్రైవ్ లో సేవ్ అయ్యే సర్వీసులను గూగుల్  నిలిపివేయనుంది. ఒక్కసారి బ్యాకప్ సర్వీసు ఆన్ చేసుకుంటే.. ఇక మన ప్రమేయం లేకుండానే డైరెక్టుగా సేవ్ అయ్యే ఈ సర్వీసు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. ఒప్పుడైనా ఫోటోలు డిలీట్ అయిపోయి ఉంటే.. వెంటనే డ్రైవ్ కు వెళ్లి బ్యాకప్ చేసుకునేది. ఇప్పటి వరకు ఫ్రీ స్టోరేజీ ఇస్తూ ఆటోబ్యాకప్ ఇచ్చిన గూగుల్ 2026, ఆగస్టు 10 నుంచి ఆ సర్వీసులను నిలిపివేయనుండటం కోట్ల మంది యూజర్లకు షాకింగ్ విషయం. 

డ్రైవ్ డెస్క్టాప్ యాప్ ను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆగస్టు 10 నుంచి ఈ సేవలు బంద్ కానున్నాయి. అంటే కంప్యూటర్ డెస్కుటాప్ డ్రైవ్ యాప్ ఇక నుంచి పనిచేయదు.  దీంతో ఇన్నాళ్లుగా దాచుకున్న స్టోరేజీ పరిస్థితేంటని యూజర్లలో ఆందోళన మొదలైంది. బ్యాకప్ టూల్స్ సింప్లిఫై చేసేందుకు తీసుకున్న నిర్ణయంగా కంపెనీ పేర్కొంది. దీనికి బదులుగా డెడికేటెడ్ ఫోటో మేనేజ్మెంట్ కోసం ఫోటోస్ యాప్ పై ఫోకస్ చేయనున్నట్లు పేర్కొంది. 

అయితే కోట్లాది యూజర్లు బ్యాకప్ కోల్పోతున్న క్రమంలో మరో ఆప్షన్ ఇచ్చింది గూగుల్. ఇప్పటి వరకు ఉన్న ఫోల్డర్స్ ను బ్యాకప్ చేసుకునేందుకు సింపుల్ ట్రిక్ చెప్పిందది. గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఫోటోలు, వీడియోలను డ్రైవ్ నుంచి గూగుల్ ఫోటోస్ కు యాడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో పూర్తిగా డేటా కోల్పోతాము అనుకున్న యూజర్లకు ఇది ఉపశమనం కలిగించే అంశం. 

గూగుల్ ఫోటోస్ తో ఏం మారనుంది..?

డెస్కుటాప్ పైన ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి.. గూగుల్ డ్రైవ్ కు అటాచ్ చేస్తే.. ఆటోమేటిక్ గా ఫోటోలు బ్యాకప్ అయ్యే ఆప్షన్ ఇన్నాళ్లు ఉండేది. అయితే ఆగస్టు 10 నుంచి ఫోల్డర్ కు.. డ్రైవ్ డెస్కుటాప్ యాప్ కు మధ్య కనెక్షన్ కట్ కానుంది. ఇక నుంచి ఫోటోస్, వీడియోస్ ఆటోమేటిక్ బ్యాకప్ అనేది ఉండదు. 

దీని అర్థం గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ పూర్తిగా క్లోజ్ అవుతున్నట్లు కాదు.   డ్రైవ్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా జరిగే సాధారణ ఫైల్ సింకింగ్ మునుపటిలాగే యధావిధిగా కొనసాగుతుంది. కేవలం డ్రైవ్-సింక్ చేసిన ఫోల్డర్ నుంచి ఫోటోలను గూగుల్ ఫోటోస్‌లోకి పంపే ఆటోమేటిక్ బ్రిడ్జ్ మాత్రమే కట్ అవుతుంది. ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే గూగుల్ ఫోటోస్‌కు బ్యాకప్ చేసిన ఏవైనా ఫోటోలు,  వీడియోలు పేఫ్ గా స్టోర్ అవుతాయని  గూగుల్ కన్ఫమ్ చేసింది. 


Google Photos బ్యాకప్‌ కోసం  ఏం చేయాలి..

ఆటోమేటిక్ ఫోటో బ్యాకప్‌లను కొనసాగించాలనుకునే వారి కోసం, Google Drive డెస్క్‌టాప్ యాప్ ద్వారా కాకుండా, నేరుగా Google Photos ద్వారానే సెటప్ చేసుకోమని  సూచిస్తోంది. ఈ రెండు ఆప్షన్స్ ద్వారా చేసుకోవచ్చు. 

* నిరంతర ఫోల్డర్ బ్యాకప్: Google Photosలో, +  బటన్‌ను ఉపయోగించి, యూజర్లు ఫోల్డర్‌లను బ్యాకప్ చేసుకోవచ్చు. గతంలో Drive డెస్క్‌టాప్ యాప్ పనిచేసిన విధంగానే,  భవిష్యత్తులో బ్యాకప్ చేయాలనుకుంటున్న కంప్యూటర్ ఫోల్డర్‌లను ఎంచుకోవచ్చు.

* Drive నుండి ఇంపోర్ట్:  యూజర్లు  Google Drive ఫోల్డర్‌లలో ఇప్పటికే నిల్వ ఉన్న ఫోటోలను నేరుగా Google Photosలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పాత Google Drive డెస్క్‌టాప్ ఇంటిగ్రేషన్‌కు భిన్నంగా, Google Photos వెబ్‌సైట్ ద్వారా సెటప్ చేసిన బ్యాకప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా జరగకుండా, బ్రౌజర్‌లో Google Photos సైట్ తెరిచి ఉన్నంత సేపు మాత్రమే నడుస్తాయి. ఈ మార్పు, పాత సెటప్ కంటే కొంతమంది యూజర్లకు తక్కువ సౌకర్యవంతంగా అనిపించవచ్చు.