Ravi Teja: రవితేజ మూవీ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఔట్.. మరో బడా నిర్మాత ఎంట్రీ?

Ravi Teja:  రవితేజ మూవీ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఔట్.. మరో బడా నిర్మాత ఎంట్రీ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ  ఫుల్ జోష్ లో ఉన్నారు . వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఈ స్టార్ హీరో.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈసారైనా సక్సెస్ ను సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ఓ సినిమాకు సంబంధించి ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది. స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు  సమాచారం.

'ఇరుముడి' రిలీజ్ కు రెడీ..

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి రవితేజ కనీస పారితోషికం తీసుకుని, లాభాల్లో వాటా తీసుకునే డీల్ కుదుర్చుకున్నట్లు టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మైత్రీ మూవీ మేకర్స్ ఔట్..

ఇదిలా ఉంటే.. దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ చేయబోయే స్టైలిష్ యాక్షన్ డ్రామాపై మొదటినుంచీ మంచి క్రేజ్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా.. లేటెస్ట్ పరిణామాలతో ఆ బ్యానర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. గతంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో ఆయన అనుబంధం కలిగి ఉన్నారు.

వరుస సినిమాలతో..

అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఎందుకు తప్పుకుంది అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. త్వరలోనే కొత్త నిర్మాణ సంస్థతో పాటు సినిమా వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రవితేజ త్వరలోనే దర్శకుడు హషిత్ గోలితో తన తదుపరి సినిమాను పట్టాలెక్కించనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'ఇరుముడి', వివేక్ ఆత్రేయ సినిమా, హషిత్ గోలి ప్రాజెక్టులతో రవితేజ లైనప్ ఇప్పుడు మాస్ ఫ్యాన్స్‌ను ఫుల్ జోష్ లో నింపింది.