శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఫ్లైట్ ఎక్కుతుండగా హార్ట్ అటాక్తో ప్రయాణికుడు స్పాట్ డెడ్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఫ్లైట్ ఎక్కుతుండగా హార్ట్ అటాక్తో ప్రయాణికుడు స్పాట్ డెడ్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాద ఘటన జరిగింది. దుబాయ్ నుంచి కొచ్చిన్ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కుతున్న కేరళ వాసి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. చెకింగ్ పాయింట్ దగ్గర హఠాత్తుగా కుప్పకూలి గుండె పోటుతో మృతి చెందాడు. సీపీఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది.

ఇండిగో విమానంలో ప్రయాణించిన అతను కొచ్చిన్ వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కుతుండగా ఇలా జరిగింది. ఇది సహజ మరణం కావడంతో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయ ఔట్ పోస్ట్ పోలీసులు కేరళకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.