Sara Tendulkar: కాబోయే భర్తలో ఈ లక్షణం ఉండాల్సిందే.. రిలేషన్‌షిప్స్‌పై సారా టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sara Tendulkar: కాబోయే భర్తలో ఈ లక్షణం ఉండాల్సిందే.. రిలేషన్‌షిప్స్‌పై సారా టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురిగా కాకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది సారా టెండూల్కర్.  న్యూట్రిషనిస్ట్‌గా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకుంది. లేటెస్ట్ గా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్న సారా మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్‌షిప్ విషయంలో తన ఆలోచనలు ఏంటో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ లక్షణాలు ఉండాల్సిందే..

తన భవిష్యత్ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో చెప్పారు సారా టెండూల్కర్. తన తల్లిదండ్రులైన సచిన్, అంజలి టెండూల్కర్‌ల బంధాన్నే ఉదాహరణగా తీసుకున్నారు. సచిన్, అంజలి మధ్య ఉన్న అనుబంధం తనకు ఎంతో ఇష్టమని, ఇద్దరూ భార్యాభర్తల కంటే ముందుగా మంచి స్నేహితుల్లా ఉంటారని ఆమె వెల్లడించారు.

ఒత్తిడితో పెళ్లి వద్దు..

ఇంట్లో సచిన్, అంజలి మధ్య సరదా సంభాషణలు, ఒకరిపై ఒకరు వేసుకునే ఫ్రెండ్లీ సెటైర్లు, నవ్వులు తన చిన్ననాటి నుంచి చూస్తూ పెరిగానని సారా తెలిపారు. అదే కారణంగా తన భవిష్యత్ భాగస్వామిలో కూడా స్నేహం, సరదా, మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు.. పెళ్లి విషయంలో తొందరపడే ఆలోచన తనకు లేదని సారా స్పష్టం చేశారు. కేవలం సమాజం , కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి కోసం పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదనే సంకేతాన్ని ఇచ్చారు.

బంధం సరిగ్గా లేదని అనిపిస్తే..

ఇక జెన్ జెడ్ రిలేషన్‌షిప్స్‌పై కూడా సారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధం సరిగ్గా లేదని అనిపిస్తే.. పెళ్లి వరకు వెళ్లి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం కంటే ముందే బయటకు రావడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. గత తరాలతో పోలిస్తే నేటి తరం తమకు నచ్చని విషయాలపై ధైర్యంగా నిర్ణయం తీసుకుంటోందని సారా పేర్కొన్నారు. మొత్తానికి.. తన కాబోయే భాగస్వామి విషయంలో సారా పెట్టుకున్న బెంచ్‌మార్క్ మాత్రం సింపుల్‌గా ఉన్నా.. చాలా స్పెషల్ అనే చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.