World Cup 2027 Qualification Scenario: వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన దిగ్గజ చరిత్ర మాది అని చెప్పుకోవడం తప్ప, కనీసం టోర్నీకి నేరుగా అర్హత సాధిద్దాం అనే ఆలోచన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి అస్సలు ఉన్నట్లు కనిపించడం లేదు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు కనీసం ఈసారైనా క్వాలిఫైయర్స్ ఆడకుండా డైరెక్ట్‌గా వెళ్తారేమో అని ఫ్యాన్స్ ఆశపడితే.. మాకింత సీన్ లేదు బాస్ అని మళ్లీ పాత దారినే సెలక్ట్ చేసుకుంటున్నారు. ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 92 రన్స్ తేడాతో గెలవడంతో, విండీస్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఆశలు గాల్లో కలిసిపోయాయి. ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు అప్పుడే నేరుగా బెర్త్‌లు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 30, 2026 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉంటేనే డైరెక్ట్ ఎంట్రీ దక్కుతుంది. కానీ విండీస్ వీరులు మాత్రం ర్యాంకింగ్స్ అడుగున స్థిరపడటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
వరల్డ్ కప్ క్వాలిఫికేషన్లో విండీస్‌ది వింతైన రికార్డు:
* 2019 వరల్డ్ కప్: డైరెక్ట్ ఎంట్రీ దక్కక క్వాలిఫైయర్స్ ఆడి అతికష్టం మీద టోర్నమెంట్లోకి వచ్చారు.
* 2023 వరల్డ్ కప్: క్వాలిఫైయర్స్ లో జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ చేతిలో దెబ్బతిని.. అసలు వరల్డ్ కప్‌కే రాకుండా టీవీల్లో మ్యాచ్‌లు చూడాల్సి వచ్చింది.
* 2027 వరల్డ్ కప్: సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఏమైనా అద్భుతం జరిగి ర్యాంకింగ్స్ పెరిగితే సరేసరి, లేదంటే హ్యాట్రిక్ బులెట్ లాగా మళ్లీ క్వాలిఫైయర్స్ ఆడటానికి విండీస్ సిద్ధం కావలసిందే.
విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘన్:
న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమితో విండీస్ స్థానం మరింత పాతాళానికి పడిపోగా, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతుంది.
జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్ పాయింట్లు క్వాలిఫికేషన్
* ఆఫ్ఘనిస్తాన్ 7వ స్థానం 90 పాయింట్లు సేఫ్ జోన్ (డైరెక్ట్ క్వాలిఫికేషన్ రేసులో ముందుకు)
* బంగ్లాదేశ్ 9వ స్థానం 83 పాయింట్లు పోటీలో ఉంది
* వెస్టిండీస్ 10వ స్థానం 73 పాయింట్లు రేసులో బాగా వెనుకబడింది
2027 ICC Men's Cricket World Cup Qualifier Confirmed Teams.
— Czarsportz Global | Associate Cricket News (@Emerging98) August 8, 2026
1) Ireland 🇮🇪
2) United States of America 🇺🇸
3) Scotland 🏴
4) Netherlands 🇳🇱
5) West Indies 🏖️🌴 (Likely)
6) 4th Place in CWC League 2 Points Table
7-10) Top 4 in CWC Qualifier Play-off pic.twitter.com/tiq2alWD8H
