నా అల్లుడు 25 మందిని పెళ్లి చేసుకున్న పచ్చిమోసగాడు: బీజేపీ ఎమ్మెల్యే

నా అల్లుడు 25 మందిని పెళ్లి చేసుకున్న పచ్చిమోసగాడు: బీజేపీ ఎమ్మెల్యే

నిత్య పెళ్లికొడుకుల బాగోతాలో ఎన్నో చూసుంటాం. కట్న కానుకలు తీసుకుని.. డబ్బు చేతికందాక చేతులెత్తేసే వాళ్లను చూశాం. అయితే సామాన్యులను, అమాయకులను మోసం చేసే వాళ్లు.. ఏకంగా ఎమ్మెల్యే కుటుంబానికే టోకరా వేయడం ఆశ్చర్యకరమైన విషయం. నా అల్లుడు 25 మందిని పెళ్లి చేసుకున్న మోసగాడు.. నా కూతురు బలైపోయింది అంటూ.. ఎమ్మెల్యే కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. 

ఉత్తరప్రదేశ్ సెవతా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారి.. తన కూతురు ఒక నిత్య పెళ్లికొడుకు చేతిలో మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పుడు చిరునామాలతో 25 మందిని పెళ్లాడిన వ్యక్తి చివరికి తమను కూడా మోసపోయినట్లు ఆగస్టు 9న కంప్లైంట్ ఇచ్చాడు. అనుజ్ త్రివేది అతని కుమారుడు ప్రఖర్ త్రివేదీని పోలీసులు అరెస్టు చేశారు. 

కంప్లైంట్ ప్రకారం ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే తివారీ కూతురు ప్రజ్ఞా.. అనుజ్ తివారీ కుమారుడు ప్రఖర్ త్రివేదీకి 2024లో మిహ్రిక్ లోని  చంద్రవాల్  లో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో తను ముంబైలో రియలెస్టేట్ వ్యాపారిగా అనుజ్ త్రివాదీ చెప్పినట్లు తెలిపాడు. 

►ALSO READ | నెలకు 30 వేలు అద్దె కడుతున్నా ఏంటీ పరిస్థితి..? సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్థానికంగా ఎంక్వైరీలు అన్ని అయిన తర్వాత పెళ్లి జరిగినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రెండున్నర ఏండ్ల తర్వాత సోషల్ మీడియా ద్వారా అసలు విషయం బయటపడినట్లు తెలిపారు. ప్రఖర్ తివారీ వివిధ రాష్ట్రాల్లో చాలా మందిని మోసం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోట్ల రూపాయల మోసం చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ ఉపయోగించి.. కోట్లర రూపాయల ఆస్తులు ఉన్నట్లు చూపించి మొత్తం 25 పెళ్లిల్లు చేసుకున్నట్లు తెలిపారు. 

ఆ కుటుంబంతో అన్ని బంధాలు తెంపుకుని తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఘటన తన కుటుంబాన్ని కుంగదీస్తోందని.. తన సామాజిక హోదాకు అగౌరవ పరుస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబాన్ని మోసం చేసినందుకు అనుజ్ త్రివేదీ, ప్రఖర్ త్రివేదీపై కేసు నమోదు చేశారు పోలీసులు.