లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ట్రైలర్ రిలీజ్..

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ట్రైలర్ రిలీజ్..

హర్ష చెముడు లీడ్ రోల్‌‌లో నటించిన చిత్రం  ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.   బాబు డెగాల దర్శకత్వంలో  చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు.  అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌‌ కానుంది.  తాజాగా  మూవీ ట్రైలర్‌‌ను విడుదల చేశారు. తన కొడుకుని ప్రేమించమని  హర్ష తండ్రి అమ్మాయిలను రిక్వెస్ట్ చేసే సన్నివేశంతో మొదలైన ట్రైలర్ హిలేరియస్‌‌గా సాగింది.  

హర్ష తనదైన ఫన్ టైమింగ్‌‌తో ఆకట్టుకోగా, ఆయన హైపర్ క్యారెక్టర్ ట్రైలర్‌‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి, హైపర్ ఆది  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అజయ్ అరసాడ సంగీతం సినిమాకు మరింత ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ను జోడించగా, శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు.