అనుపమ పరమేశ్వరన్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, శనివారం సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన మెలోడీకి జి.వెంకన్న లిరిక్స్ అందించాడు. అనురాగ్ కులకర్ణి పాడాడు.
‘అందం మురిసే, గంధం కురిసే.. పిల్లా నీ మేని సొగసులనే చూసి, వేకువలోనా వెన్నెల కాసి, పిల్లా నీ పెదవులపై నవ్వై పూసే, నీ అడుగులతోనే అవనే పులకించే, నీ తనువును తాక మేఘం తలవంచే, సింగిడి రంగులతో పొంగే ఆకాశం, నీ ఒంటికి చీరై నిగనిగా మెరిసిందా..’ అంటూ సాగిన పాట ఆకట్టుకుంది.
ఇందులో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
