అద్దె నెలకు 30 వేలు. మెయింటెనెన్స్కు మరో 3 నుంచి 4 వేలు. అదనంగా కరెంట్ బిల్లు సపరేట్. అయినప్పటికీ ప్రశాంతత లేని జీవనం. వర్షం పడితే చెరువును తలపించే బేస్మెంట్. బయటకు పోవడానికి లేదు. లోపలికి రావడానికి లేదు. నోయిడాలోని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో అద్దెకు ఉంటున్న ఒక కుటుంబం పరిస్థితి ఇది.
వర్షం పడితే తమ బేస్మెంట్ స్విమ్మింగ్ పూల్లా మారిపోతుందని ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. వేలకు వేలు అద్దె తీసుకుంటూ కూడా ఇలాంటి చెత్త మెయింటెనెన్స్ చేస్తున్నారని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న చాలా మంది తమ చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
►ALSO READ | రష్యా నుంచి ఇండియాకు రైలు.. వయా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్!
ఈ వీడియో పోస్ట్ చేసిన మహిళ తమ బేస్ మెంట్ పరిస్థితిపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. “ఫ్రీ స్విమ్మింగ్ పూల్” అని పోస్ట్ చేసింది. అదే సొసైటీలో దాదాపు రూ. 2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయని, అక్కడ ఉంటున్న వాళ్లు ఇల్లు, కార్లపై భారీగా పెట్టుబడులు పెట్టారని.. కానీ మెయింటెనెన్స్ మాత్రం ఇంత దారుణంగా ఉందని ఆమె వాపోయింది.
కొందరు నెటిజన్లు ఆ సొసైటీని నోయిడా, సెక్టార్ 46లోని అమ్రపాలి సఫైర్‌గా గుర్తించారు. చాలా మంది నెటిజన్లు సదరు మహిళ అసంతృప్తితో ఏకీభవించారు. భారీగా అద్దెలు, నిర్వహణ ఛార్జీలు చెల్లిస్తున్నప్పుడు మెరుగైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా ఉండాలని వాదించారు.
