రష్యా నుంచి ఇండియాకు డైరెక్ట్ రైలు మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు రష్యా ప్రతిపాదించింది. హిందూ మహాసముద్రానికి నేరుగా రైలు మార్గాన్ని తీసుకువచ్చే ఆలోచనలు ఉన్నట్లు రష్యా ఉపప్రధాని మరత్ ఖుస్నులిన్ ఆగస్టు 09న ప్రకటించారు.
బోస్పోరస్ జలసంధి, హార్మూజ్ జలసంధి వంటి రవాణా మార్గాల ద్వారా రిస్కును తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వయా పాకిస్తాన్:
హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు రష్యా పేర్కొంది. రష్యా ప్రతిపాదించిన మార్గం.. రష్యా నుంచి తుర్క్ మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా.. చివరగా ఇండియాకు చేరుకుంటుంది.
ఇండియాకు ప్రవేశం కల్పించే ప్రతి అవకాశాన్ని రష్యా సద్వినియోగం చేసుకుంటుందని ఆయన అన్నారు. అయితే అధికారికి రూట్, టికెట్ ధరలు, ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాలను మత్రం వెల్లడించలేదు.
►ALSO READ | యూఏఈ నౌకపై.. ఇరాన్ మిసైల్ దాడి..వారంలో మూడుసార్లు దాడులు
సముద్ర మార్గాల గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషనలో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చింది. ఓడల రవాణా మార్గానికి ప్రపంచంలో హార్మూజ్ జలసంధి ఒక్కటే కీలకమైనవిషయం తెలిసిందే. 25 శాతం చమురు, 20 శాతం సీఎన్జీ రవాణా హార్మూజ్ నుంచే జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ జలసంధి హక్కులపై అమెరికా ఇరాన్ మధ్య యుద్ధమే జరుగుతోంది. ఆ కారణంగా రవాణా దెబ్బతిన్నది.
భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలను అధిగమించేందుకు రైల్వే మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు రష్యా చెబుతోంది. సముద్ర మార్గం కాకుండా నేరుగా భూ మార్గం ద్వారా భారత్ కు కనెక్టివిటీ పెంచుకోవచ్చునని రష్యా చెబుతోంది. అయితే ఇదే జరిగితే దక్షిణ ఆసియా, సెంట్రల్ ఆసియాలో భారత్ కు కాస్త బలం పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ ప్రతిపాదన ఎప్పుడు పట్టాలెక్కుతుందనేదే ప్రశ్న.
