రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్ లను ప్రకటించింది బీజేపీ. 2026 సెప్టెంబర్ 23న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లిస్టును విడుదల చేశారు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్. తెలంగాణ ఇన్చార్జిగా సునీల్ బన్సల్, సహ ఇన్చార్జులుగా రేఖ శర్మ, అభయ్ పాటిల్ లను నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిగా అరవింద్ భదౌరియా, వనతీ శ్రీనివాసన్ లను నియమించారు.
బీజేపీ కొత్తగా చేపట్టిన నియామకాలలో తెలుగువారికి అవకాశాలు దక్కాయి. అందులో సీనియర్ నేత రామ్ మాధవ్ తమిళనాడు బీజేపీ ఇంచార్జ్ గా నియమితులయ్యారు. సహ ఇంచార్జ్ గా ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఇక ఒడిశా ఇంఛార్జిగా పురందేశ్వరి, కర్ణాటక సహా ఇంచార్జీ గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ను అధిష్టానం నియమించింది.
ఫుల్ లిస్ట్:
రాష్ట్రం/యూటీ ఇన్‌చార్జ్ సహ-ఇన్‌చార్జ్(లు)
అండమాన్ & నికోబార్ - జై ప్రకాష్, ఢిల్లీ -
అరుణాచల్ ప్రదేశ్ దేవేష్ కుమార్, బీహార్ -
ఆంధ్రప్రదేశ్ అరవింద్ భదోరియా వనతి శ్రీనివాసన్
అస్సాం మంగళ్ పాండే ఫాంగ్నాన్ కోన్యాక్,
మనోజ్ టిగ్గా
బీహార్ హరీష్ ద్వివేది సంగీత యాదవ్, రోహన్ గుప్తా
చండీగఢ్ మహేంద్ర పాండే -
ఛత్తీస్‌గఢ్ స్మృతి ఇరానీ సిద్ధార్థ శంభు
దాద్రా & నగర్ హవేలీ ,
డామన్ & డయ్యూ వర్షాబెన్ నరేంద్ర భాయ్ దోషి -
ఢిల్లీ వినయ్ సహస్రబుద్ధే జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, దర్శన జర్దోష్
గోవా భారతి ప్రవీణ్ పవార్ అనిల్ ఆంటోనీ
గుజరాత్ తరుణ్ చుగ్ అజయ్ మహావార్, గోమతి సాయి
హర్యానా స్మృతి ఇరానీ భోలా సింగ్
హిమాచల్ ప్రదేశ్ శ్రీకాంత్ శర్మ దర్శన సింగ్
జమ్మూ & కాశ్మీర్ సతీష్ పూనియా రీనా కశ్యప్
జార్ఖండ్ గజేంద్ర పటేల్ సౌరభ్ సింగ్, నివేదిత సింగ్
కర్ణాటక హరీష్ ద్వివేది కాసం వెంకటేశ్వరలు
కేరళ ఎం. నాగరాజ ఎం. వెంకటేశన్
లడఖ్ రాజ్‌కుమార్ భాటియా, ఢిల్లీ -
లక్షద్వీప్ జార్జ్ కురియన్ -
మధ్యప్రదేశ్ బాబుల్ కుమార్ దేబ్ రేఖ వర్మ
మహారాష్ట్ర బైజయంత జయ పాండా అమిత్ మాల్వియా, సదానంద్ షెట్ తనవాడే, కమల్జీత్ సెహ్రావత్
మణిపూర్ రాజ్‌దీప్ రాయ్ -
మేఘాలయ కనద్ పుర్కాయస్థ నుమల్ మోమిన్
మిజోరాం భగవత్ కరాద్ -
నాగాలాండ్ అనిల్ ఆంటోనీ -
ఒడిశా డి. పురందేశ్వరి స్వదేశ్ సింగ్
పుదుచ్చేరి కె. సురేంద్రన్ -
పంజాబ్ సతీష్ పూనియా వీరేంద్ర సచ్‌దేవా, అల్కా గుర్జర్
రాజస్థాన్ సంజయ్ భాటియా కవితా పటీదార్, కుల్జీత్ చాహల్
సిక్కిం రాజు బిస్తా -
తమిళనాడు రామ్ మాధవ్ నిర్మల్ కుమార్ సురానా, డికె అరుణ
తెలంగాణ సునీల్ బన్సల్ అభయ్ పాటిల్, రేఖా శర్మ
త్రిపుర మృగాంక దేబ్ బర్మన్ -
ఉత్తర ప్రదేశ్ వినోద్ తావ్డే జగదీష్ పటేల్,
మేధా కులకర్ణి, ప్రదీప్ శర్మ, అనంత్ ఓజా
ఉత్తరాఖండ్ రామ్ మాధవ్ అరవింద్ మేనన్, బాన్సురి స్వరాజ్
పశ్చిమ బెంగాల్ సునీల్ బన్సల్ లాల్ సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహ
